హైవేపై ఇన్‌స్టా రీల్.. వైశాలికి 17వేల జరిమానా
Instagram Influencer Vaishali: హైవేపై కారు ఆపి మరీ ఇన్‌స్టా రీల్ చేసింది వైశాలి. ఆమెకు ఘజియాబాద్ పోలీసులు 17 వేల ఫైన్ విధించారు. ప్రస్తుతం ఆ రీల్ ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
న్యూఢిల్లీ: సోషల్ మీడియా యూజర్లు ఇప్పుడు తమ తమ వీడియోలతో ఇంటర్నెట్ అభిమానుల్ని తెగ అట్రాక్ట్ చేస్తున్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసేందుకు కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఇన్ఫ్లయెన్సర్ వైశాలి చౌదరీ కుటేల్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా పాపులర్. అయితే ఆమె తాజాగా ఘజియాబాద్ హైవేపై ఓ ఇన్‌స్టా రీల్ చేసింది. హైవేపై కారును ఆపి కొన్ని ఫోజులు ఇచ్చింది. రోడ్డు మీద క్యాట్‌వాక్ చేసింది.
వైశాలి చేసిన ఆ వీడియోకు ఇన్‌స్టాలో తెగ లైక్‌లు వచ్చాయి. కానీ పోలీసులు మాత్రం ఆమెకు ఫైన్ విధించారు. రోడ్డు భద్రతా రూల్స్‌ను ఆమె ఉల్లంఘించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వైశాలికి 17 వేలు జరిమానా విధించినట్లు పోలీసులు చెప్పారు. ఇన్ఫ్లుయెన్సర్ వైశాలికి ఇన్‌స్టాలో 6,52,000 ఫాలోవర్లు ఉన్నారు. సాహిబాబాద్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు బుక్ చేశారు. వైశాలి నడిపిన కారుకు ట్రాఫిక్ పోలీసులు 17వేల జరిమానా విధించినట్లు సాహిదాబాద్ ఏసీపీ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

