Maoists | బీజాపూర్ జిల్లాలో ఇన్ఫార్మర్ను కొట్టి చంపిన మావోయిస్టులు
Maoists | ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో ఓ 41 ఏండ్ల వ్యక్తిని కొట్టి చంపారు మావోయిస్టులు.
Maoists | రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో ఓ 41 ఏండ్ల వ్యక్తిని కొట్టి చంపారు మావోయిస్టులు. మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాడనే అనుమానంతో అతన్ని చంపేశారు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు.
మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన వ్యక్తిని భద్రు సోడిగా పోలీసులు గుర్తించారు. బైరాంఘర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కేశముండి గ్రామ వాసి భద్రు అని తెలిపారు. ఇక భద్రు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
భద్రును చంపిన ప్రదేశంలో మావోయిస్టులు ఒక లేఖను వదిలి వెళ్లిపోయారు. సోడి యాంటీ మావోయిస్టు సివిల్ మిలిషీయా సల్వా జుడుం మూవ్మెంట్లో యాక్టివ్‌గా పాల్గొన్నారని ఆ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంలో కీలకంగా ఉన్నారని, అందుకే హత్య చేసినట్లు తెలిపారు. మావోయిస్టుల కోసం పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Bengaluru | ఉత్తరాదివారికి బెంగళూరులో నో ఎంట్రీ.. కన్నడ రాని పొరుగు రాష్ర్టాలవాళ్లకు కూడా!
Rabies | రేబిస్ మరణాల కట్టడిలో మనమెక్కడ?.. జంతువుల కాట్లలో 76.8 శాతం కుక్క కాట్లే
Alzheimers | తల్లి ఎక్స్ క్రోమోజోములతోనే అల్జీమర్స్.. మెదడు వృద్ధాప్యానికి అదే కారణం!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

