Vishwa Rajkumar | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 : పుదుచ్చేరిలోని మనకుల వినయగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థి విశ్వ రాజ్‌కుమార్(20) ప్రపంచ జ్ఞాపకశక్తి లీగ్ ఛాపింయన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. ఆన్లైన్లో జరిగిన ఈ పోటీల్లో కేవలం 13.50 సెకన్లలో 80 అంకెలను జ్ఞప్తికి తెచ్చుకొని సహ పోటీదారులను అవాక్కయ్యేలా చేశాడు. ఇందులో యాదృచ్ఛికంగా తెరపై ప్రదర్శించిన 80 అంకెలను వీలైనంత త్వరగా తిరిగి గుర్తుకు తెచ్చుకోవాలి. వాటిని 100% కచ్చితత్వంతో రీకాల్ షీట్లో నమోదు చేయాలి. రాజ్‌కుమార్ ఈ లక్ష్యాన్ని రికార్డు వేగంతో పూర్తి చేయడంతో పాటు 30 చిత్రాలను కేవలం 8.40 సెకన్లలో తిరిగి గుర్తు చేసుకున్నాడు.