20 కోట్ల ఏండ్ల తర్వాత మహాభారత్

- తూర్పు ఆఫ్రికా దేశాలు, మడగాస్కర్, సీషెల్స్ దీవులు ఇండియాతో కలుస్తాయి
- భూగర్భ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 7: తూర్పు ఆఫ్రికా దేశాలైన సోమాలియా, కెన్యా, టాంజానియా, మొజాంబిక్‌తో పాటు మడగాస్కర్ దేశాలు 20 కోట్ల సంవత్సరాల్లో భారత భూభాగంతో కలిసిపోతాయని ఓ అధ్యయనం పేర్కొన్నది. ఈ దేశాలు భారత పశ్చిమ తీరాన్ని తాకడం వల్ల తీరం వెంబడి పొడవైన పర్వత శ్రేణి ఏర్పడుతుందని తెలిపింది. ఈ పర్వత శ్రేణికి సోమాలయా అని పేరు కూడా పెట్టింది. నెదర్లాండ్స్‌లోని యూట్రెక్ట్ యూనివర్సిటీ సైంటిస్టు డూవీ వాన్ హిన్బెర్జెన్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. కాలక్రమంలో సీషెల్స్, మారిషస్ దీవులు అన్నీ కలిసిపోతాయని చెప్పారు. ఇవి తాకడం వల్ల లక్ష దీవులు హిమాలయాల్లాగా 8 కిలోమీటర్ల ఎత్తుతో పర్వతాలుగా మారుతాయని పేర్కొన్నారు. ముంబై నగరం సోమాలయ పర్వత శ్రేణి పాదాల వద్ద ఉంటుందన్నారు. ఖండచలన సిద్ధాంతం ప్రకారం.. గతంలో ఒకే ఖండంగా ఉన్న ఈ భూమిలో అంతర్గత పలకల్లో కదలికలతో ఖండాలుగా విడిపోయింది. అవి ఇంకా కదులుతూనే ఉన్నాయి. ఈ కదలికల్లో భాగంగానే ఆఫ్రికా దేశాలు భారత్ వైపు కదులుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. పైన పేర్కొన్న దేశాలకు, ఆఫ్రికా ఖండానికి మధ్య ఇప్పటికే లోయలు ఉద్భవించాయని తెలిపారు. ఈ వివరాలను అమెరికన్ జర్నల్ ఆఫ్ సైన్స్‌లో ప్రచురించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Indian territory
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

