టెలిగ్రాం సీఈవో అరెస్ట్ : హోం శాఖను అప్రమత్తం చేసిన ఐటీ మంత్రిత్వ శాఖ
Telegram : మెసేజింగ్ యాప్ టెలిగ్రాం సీఈవో పావెల్ దురోవ్‌ను ఫ్రాన్స్‌లో అదుపులోకి తీసుకోవడంతో ఐటీ మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది.
Telegram : మెసేజింగ్ యాప్ టెలిగ్రాం సీఈవో పావెల్ దురోవ్‌ను ఫ్రాన్స్‌లో అదుపులోకి తీసుకోవడంతో ఐటీ మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. భారత్‌లో టెలిగ్రాం యాప్ నిబంధనల ఉల్లంఘనలకు ఏమైనా పాల్పడిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని హోంమంత్రిత్వ శాఖను ఐటీ మంత్రిత్వ శాఖ కోరింది. టెలిగ్రాంపై ఏమైనా ఫిర్యాదులుపెండింగ్లో ఉంటే భారత్‌లోనూ సదరు యాప్‌పై తగిన చర్యలు చేపట్టేందుకు ఐటీ మంత్రిత్వ శాఖ సన్నద్ధమైంది.
ఫ్రాన్స్‌లో పావెల్ దురోవ్ అరెస్ట్ నేపధ్యంలో టెలిగ్రాంపై పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను పరిశీలించాలని, యాప్‌పై ఎలాంటి చర్యలు చేపట్టవచ్చని హోంమంత్రిత్వ శాఖను ఐటీ మంత్రిత్వ శాఖ కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దోపిడీ,గ్యాంబ్లింగ్ వంటి కార్యకలాపాలకు టెలిగ్రాం యాప్ ప్లాట్‌ఫాంగా దుర్వినియోగంపై భారత ప్రభుత్వం నిర్ధిష్టంగా టెలిగ్రాంపై విచారణ చేపట్టాలని యోచిస్తోందని మరో వార్తా కథనం వెల్లడించింది.
కాగా, మెసేజింగ్ యాప్ టెలిగ్రాం సీఈవో పవెల్ దురోవ్‌ను ఫ్రాన్స్‌లోని లీ బగెట్ ఎయిర్‌పోర్ట్‌లో తన ప్రైవేట్ జెట్ నుంచి దిగిన వెంటనే అరెస్ట్ చేశారు. మెసేజింగ్ యాప్‌నకు జారీ చేసిన ఓ వారెంట్ కింద టెలిగ్రాం సీఈవోను ఫ్రాన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టెలిగ్రాంపై నేర కార్యకలాపాలను నియంత్రించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆయన అరెస్ట్‌కు దారితీసిందని చెబుతున్నారు.
టెలిగ్రాంను చట్టవిరుద్ధ కార్యకలపాలకు వినియోగించుకునేందుకు నిరోధించేందుకు సరైన చర్యలు చేపట్టడంలో ఆయన విఫలమయ్యారని అధికారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలను టెలిగ్రాం తోసిపుచ్చింది. సీఈవో తప్పించుకుని తిరగడం లేదని, ఆయన అదృశ్యం కాలేదని పేర్కొంది. మరోవైపు దురోవ్‌పై మోసం, డ్రగ్ ట్రాఫికింగ్, వ్యవస్ధీకృత నేరం, ఉగ్రవాదానికి ఊతం సహా పలు ఆరోపణలు ఉన్నాయి. ఫ్రాన్స్ అధికారులు చేసిన ఆరోపణలన్నింటినీ టెలిగ్రాం కొట్టిపారేసింది.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Type 1 Diabetes | చిన్నారుల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. అది టైప్-1 డయాబెటిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి..
IPS Officer | మహిళా ఐపీఎస్ అధికారికి అశ్లీల వీడియోలు.. తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం
INDvsNZ | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ భారీ ఆధిక్యం.. 109/2 వద్ద న్యూజిలాండ్ పోరాటం
Hyderabad | హైదరాబాద్ శివార్లలో మళ్లీ భూముల వేలం.. రూ.600 కోట్ల సమీకరణపై సర్కారు గురి!
వికారాబాద్‌లో లారీ బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

