Bhashini App | న్యూఢిల్లీ: భారతదేశంలో చాలా మతాలు, ప్రాంతాలున్నాయి. ఉపాధి లేదా ఇతర అవసరాల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లి, మాతృభాష తప్ప వేరే భాష రాని వారు కమ్యూనికేషన్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో దీనికి పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం ‘భాషిణి’ పేరుతో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత యాప్ను అభివృద్ధి చేసింది.
ఇది ఒక భారతీయ భాషను మరో భాషలోకి, అదే విధంగా ఇంగ్లిష్ నుంచి భారతీయ భాషలోకి అనువదిస్తుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ వేదికల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.