డిసెంబర్ నాటికి దేశ ప్రజలందరికీ టీకాలు: కేంద్ర మంత్రి జవదేకర్

న్యూఢిల్లీ : కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇవాళ ఓ శుభవార్త వినిపించారు. దేశ ప్రజలందరికీ డిసెంబర్ నాటికి కోవిడ్ టీకాలు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి 130 రోజులైంది. అయితే ఇప్పటి వరకు ఇండియాలో 20 కోట్ల మంది టీకాలు తీసుకున్నారు. కోవిడ్ నియంత్రణలో టీకాలే కీలకమని అందరూ చెబుతున్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సినేషన్లో 20 కోట్ల మైలురాయిని అందుకున్న రెండవ దేశంగా ఇండియా నిలిచింది. ఈ ఘనతను కేవలం అగ్రరాజ్యం అమెరికా మాత్రమే చేరుకున్నది. గత 44 రోజుల్లో ఇవాళ అత్యల్ప స్థాయిలో కొత్త కేసులు నమోదు అయ్యాయి. 2.48 కోట్ల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 2.59 లక్షల మంది వైరస్ నుంచి రికవరీ అయ్యారు.
ఇవాళ మధ్యాహ్నం ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ పైర్ అయ్యారు. 130 కోట్ల మంది జనాభాలో కేవలం 3 శాతం మందికి మాత్రమే టీకాలు ఇచ్చినట్లు రాహుల్ ఆరోపించారు. సెకండ్ వేవ్ విజృంభించడానికి మోదీయే కారణమని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చిన జవదేకర్ మాట్లాడుతూ.. 2021 లోపే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగుస్తుందన్నారు. వ్యాక్సిన్ల గురించి రాహుల్ ఆందోళన చెందితే, అప్పుడు ఆయన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల గురించి ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ గందరగోళంగా సాగుతోందని, 18-44 ఏళ్ల వారికి ఇచ్చిన కోటాను వాళ్లు తీసుకోవడం లేదని జవదేకర్ ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

