నిసార్ సక్సెస్.. జీఎస్ఎల్వీ ఎఫ్-16 ప్రయోగం విజయవంతం
అమెరికా, భారత్ సంయుక్తంగా చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం ‘నిసార్' విజయవంతమైంది. బుధవారం సాయంత్రం 5.40 గంటలకు ఆంధ్రపదేశ్ శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీ ఎఫ్-16 రాకెట్ నిప్పులు వెదజల్లుతూ నింగిలోకి దూసుకెళ్లింది.
- నిర్దేశిత కక్ష్యలోకి చేరిన భూపరిశీలన ఉపగ్రహం
- ఇస్రో, నాసా కలిసి ప్రయోగించిన తొలి శాటిలైట్
శ్రీహరి కోట, జూలై 30 : అమెరికా, భారత్ సంయుక్తంగా చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం ‘నిసార్’ విజయవంతమైంది. బుధవారం సాయంత్రం 5.40 గంటలకు ఆంధ్రపదేశ్ శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీ ఎఫ్-16 రాకెట్ నిప్పులు వెదజల్లుతూ నింగిలోకి దూసుకెళ్లింది. సుమారుగా 2,393 కిలోగ్రాముల బరువున్న ‘నిసార్’ను భూమికి 745 కిలోమీటర్ల కక్ష్యలో ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. శాటిలైట్ సేవలు ప్రారంభం కావడానికి మరికొద్ది రోజులు పడుతుందని ప్రకటించింది.
ఉపయోగం ఏమిటి?
భూ ఉపరితలంలో వచ్చే మార్పులు, అంటార్కిటికాలో మంచు పలకల కదలికలు, పర్యావరణ మార్పులు, సముద్ర ప్రాంతాల్ని అధ్యయనం చేయటం ‘నిసార్’ మిషన్ ప్రధాన లక్ష్యం. భూమి ఉపరితలాన్ని అత్యంత కచ్చితత్వంతో స్కాన్ చేస్తుంది. భూమిపై ఒక్క సెంటీమీటర్ మార్పులను కూడా గుర్తిస్తుంది. భూకంపాలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలపై నిరంతరం ఓ కన్నేసి ఉంచవచ్చు. ప్రకృతి విపత్తులు, మానవ ప్రమేయంతో జరిగే వాటిని ఎదుర్కొనటంలో ప్రభుత్వాలకు ‘నిసార్’ డాటా కీలకం. భూ పరిశీలనపై ఇప్పటివరకు పంపిన శాటిలైట్లు ఒక ఎత్తు.. ‘నిసార్’ ఒక ఎత్తు.
అమెరికా, భారత్ సంయుక్త మిషన్
ఇస్రో, నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ జీవితకాలం 5 ఏండ్లు. ఇందులోని వివిధ పరికరాలను నాసా, ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. నాసా, ఇస్రో ఇప్పటివరకు ప్రయోగించిన రాడార్లలో అత్యంత శక్తివంతమైనది ‘నిసార్’. ఎల్-బ్యాండ్ రాడార్, హైస్పీడ్ డౌన్‌లింక్, జీపీఎస్ రిసీవర్ మొదలైనవి నాసా అందజేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

