న్యూఢిల్లీ, జూన్ 6: అగ్ని-4 మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని అబ్దుల్ కలాం దీవి నుంచి సోమవారం సాయంత్రం 7.30 గంటలకు ఈ ప్రయోగం నిర్వహించారు. స్ట్రాటెజిక్ ఫోర్సెస్ కమాండ్ నేతృత్వంలో ట్రైనింగ్లో భాగంగా క్షిపణిని పరీక్షించారు. నిర్దేశించిన లక్ష్యాన్ని అగ్ని-4 ఛేదించిందని శాస్త్రవేత్తలు తెలిపారు.