దేశంలో 7 వేలు దాటిన రోజువారీ కరోనా కేసులు
coronavirus | దేశంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. క్రమంగా పది వేలవైపు పరుగులు పెడుతున్నాయి. బుధవారం 5233 మంది పాజిటివ్లుగా నిర్ధారణకాగా, నేడు ఆ సంఖ్య 7240కి చేరింది. ఇది బుధవారం నాటికంటే 40 శాతం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. క్రమంగా పది వేలవైపు పరుగులు పెడుతున్నాయి. బుధవారం 5233 మంది పాజిటివ్లుగా నిర్ధారణకాగా, నేడు ఆ సంఖ్య 7240కి చేరింది. ఇది బుధవారం నాటికంటే 40 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో మొత్తం బాధితులు 4,31,97,522కు చేరారు. ఇందులో 4,26,40,301 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,723 మంది మృతిచెందారని తెలిపింది.
ఇక రోజువారీ కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా అధికమవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 32,498 కేసులు యాక్టివ్గా ఉన్నాయని పేర్కొన్నది. గత 24 గంటల్లో కరోనాకు ఎనిమిది మంది బలవగా, 3591 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని తెలిపింది.
కొత్తగా నమోదైన కేసుల్లో సగానికిపైగా రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 2701 కేసులు ఉండగా, కేరళలో 2271, ఢిల్లీలో 564, కర్ణాటకలో 376, హర్యానాలో 247 చొప్పున నమోదయ్యాయని వెల్లడించింది.
కాగా, పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1.62కు చేరిందని ఆరోగ్య శాఖ పేర్కొన్నది. యాక్టివ్ కేసులు 0.08 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.71 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నాయని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,94,59,81,691 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, ఇందులో బుధవారం 15,43,748 మందికి వ్యాక్సినేషన్ చేశామని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

