దేశంలో కొత్తగా 185 కరోనా కేసులు
Corona | దేశంలో కొత్తగా 185 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,76,515కు చేరాయి. ఇందులో
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నది. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, కరోనా నిబంధనలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో కొత్తగా 185 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,76,515కు చేరాయి. ఇందులో 4,41,42,432 మంది కోలుకున్నారు. మరో 3402 కేసులు యాక్టివ్గా ఉండగా, ఇప్పటివరకు 5,30,681 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో మహమ్మారికి ఒకరు బలయ్యారు.
రికవరీ రేటు 98.72 శాతంగా ఉండగా, యాక్టివ్ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2,20,02,12,178 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. బుధవారం ఒక్కరోజే 1,17,538 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నది.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని పరిస్థితుల, ఇతర అంశాలపై ప్రధాని మోదీ నేడు సమీక్షించనున్నారు. గురువారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి అధికారులతో చర్చిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

