మానవాభివృద్ధిలో మరింత దిగువకు..
కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ అంతర్జాతీయ సూచీల్లో భారత ర్యాంకు క్రమంగా దిగజారుతూ వస్తున్నది. తాజాగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) విడుదల చేసిన మానవాభివృద్ధి సూచీ(హెచ్‌డీఐ)లోనూ భారత ర్యాంకు పడిపోయింది
- పడిపోయిన భారత్ ర్యాంకు
- 131 నుంచి 132వ స్థానానికి..
- మనం కంటే మెరుగైన స్థానంలో బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 85: కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ అంతర్జాతీయ సూచీల్లో భారత ర్యాంకు క్రమంగా దిగజారుతూ వస్తున్నది. తాజాగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) విడుదల చేసిన మానవాభివృద్ధి సూచీ(హెచ్‌డీఐ)లోనూ భారత ర్యాంకు పడిపోయింది. 2021 ఏడాదికి గానూ 191 దేశాలకు ర్యాంకులు కేటాయించగా, భారత్ 132వ స్థానంలో నిలిచింది.
అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఒక ర్యాంకు దిగజారింది. 2020లో భారత్ ర్యాంకు 131 కాగా, అంతకుమునుపు ఏడాది 129వ స్థానంలో ఉండేది. ఆయుర్దాయం, విద్యా స్థాయిలు, జీవన ప్రమాణాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు కేటాయిస్తారు. స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌ల్యాండ్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక కూడా మనకంటే ముందున్నాయి.
తగ్గిన ఆయుర్దాయం
భారత్‌లో హెచ్‌డీఐ స్కోరు 2019లో 0.645 ఉండగా, 2021లో 0.633కి పడిపోయింది. ఆయుర్దాయం 69.7 ఏండ్ల నుంచి 67.2 ఏండ్లకు పడిపోవడమే ఇందుకు కారణం. కరోనా మహమ్మారి కారణంగా మానవాభివృద్ధి సూచిక వరుసగా రెండేండ్లు (2020,21) క్షీణించిపోయిందని యూన్‌డీపీ పేర్కొన్నది. ప్రపంచ ఆయుర్దాయం 2019లో 73 ఏండ్లు ఉండగా, 2021లో 71.4 ఏండ్లకు తగ్గిందని వెల్లడించింది. గత 30 ఏండ్లలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం ఇదే తొలిసారి అని వివరించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రపంచవ్యాప్తంగా ఆహార, ఇంధన సంక్షోభాలను మరింత ముదిరేలా చేసిందని తెలిపింది.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

