చక్కెర ఎగుమతిపై నిషేధం.. వచ్చే అక్టోబర్ వరకు పొడిగించిన కేంద్రం
Sugar exports | చక్కెర ఎగుమతిపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడిగించింది. దేశంలో ద్రవ్యోల్భణం పెరుగుతుండటంతో నిత్యావసరాల ధరలు నానాటికి పెరుగుతూ వస్తున్నాయి.
ముంబై: చక్కెర ఎగుమతిపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడిగించింది. దేశంలో ద్రవ్యోల్భణం పెరుగుతుండటంతో నిత్యావసరాల ధరలు నానాటికి పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చక్కెర ధరలను నియంత్రించడంలో భాగంగా ఈ ఏడాది జూన్ 1 నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు వరకు ఎగుమతులపై నిషేధం విధించింది. మరో రెండు రోజుల్లో ఈ గడువు ముగుస్తుండటంతో ఆంక్షలను మరో ఏడాదిపాటు పొడిగించింది. 2023 అక్టోబర్ వరకు నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో దేశంలో చక్కెర ధరలను నియంత్రించవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కాగా, ఈ ఏడాది దేశంలో చెరకు ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో 8 మిలియన్ టన్నుల చక్కెరను ఎగుమతి చేయవచ్చని ప్రభుత్వం, వ్యాపార వర్గాలు ఈ నెల మొదటివారంలో వెల్లడించాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చక్కెర ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది.

ప్రపంచంలో చక్కెర ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉన్నది. గతకొన్నేండ్లుగా ప్రతి సంవత్సరం దేశం నుంచి చక్కెర ఎగుమతులు పెరుగుతూ వస్తున్నాయి. 2018-19లో 38 లక్షల టన్నులుగా ఉన్న ఎగుమతులు.. 2019-2020 నాటికి అది 59.60 లక్షల టన్నులకు చేరింది. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరంలో 70 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. ఇండోనేషియా, మలేషియా, దుబాయ్, అఫ్ఘానిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌తోపాటు ఆఫ్రికన్ దేశాలకు భారత్ చక్కెరను ఎగుమతి చేస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

