Ladakh standoff | ఈ నెల 17న భారత్ – చైనా సైనికుల మధ్య చర్చలు
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లో కొనసాగుతున్న సరిహద్దు ప్రతిస్టంభన నేపథ్యంలో భారత్ – చైనా దేశాల మధ్య ఈ నెల 17న 16వ రౌండ్ సైనిక చర్చలు జరుగనున్నాయి. ఈ సారి చర్చలు వాస్తవాధీన రేఖ (LAC) వెంట భారత్ వైపున జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి సరిహద్దు వెంట శాంతి, ప్రశాంతత అవసరమని నొక్కి చెబుతూనే తూర్పు లడఖ్‌లోని మిగతా అన్ని పాయింట్ల నుంచి దళాలను ఉపసంహరించాలని చైనాపై భారత్ ఒత్తిడి తెస్తున్నది.
ఇంతకు ముందు భారత సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) మధ్య చివరి రౌండ్ చర్చలు గత మార్చి 11న జరిగాయి. తాజాగా జరిగే చర్చల్లో దేప్పాంగ్ బల్గే, డెమ్‌చోక్‌ల్లో సమస్యల పరిష్కారంతో పాటు అన్ని ఘర్షణ పాయింట్ల నుంచి వీలైనంత త్వరగా దళాలను వెనక్కి పిలవాలని చైనాపై భారత్ ఒత్తిడి చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. గతవారం బాలిలో జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సమావేశమై త్వరగా తూర్పు లడఖ్ పరిస్థితుల పరిష్కారంపై చర్చించారు. 2020, మే5న పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో భారత్ – చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగగా.. ఆ తర్వాత సరిహద్దుపై ప్రతిష్టంభన నెలకొంది. ఆ తర్వాత ఇరుదేశాలు భారీగా సైనికులు, ఆయుధాలను మోహరించాయి. సైనిక, దౌత్యపరమైన చర్చల తర్వాత గతేడాది పలు ప్రాంతాల నుంచి సైనికులను వెనక్కి పిలిచాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

