ఈ100 ఇంధనానికి ఆమోదం
కేంద్ర మోటారు వాహనాల నిబంధనలను సవరించడం ద్వారా ఈ100 ఇంధనాన్ని ఆమోదించింది. కొన్ని వాహన తయారీ సంస్థలు తమ ఈ100 కార్లను మార్కెట్ లోకి విడుదల..
- త్వరలో మార్కెట్లోకి ఈ100తో నడిచే కార్లు
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశంలో 100 శాతం ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల(ఈ100) కోసం కేంద్ర ప్రభుత్వం నిబంధనలను జారీచేసింది. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలను సవరించడం ద్వారా ఈ100 ఇంధనాన్ని ఆమోదించింది. కొన్ని వాహన తయారీ సంస్థలు తమ ఈ100 కార్లను మార్కెట్ లోకి విడుదల చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలోనే ఈ నిర్ణయం వెలువడింది.
అధికారిక ప్రకటన ప్రకారం మోటారు వాహనాల నిబంధనల్లో చేసిన తాజా మార్పుల్ల్లో ఉద్గార నిబంధనలకు సంబంధించి ఈ85 ఇంధనంతో పాటు ఈ100 ఇంధనాన్ని కూడా చేర్చారు. ఈ85, ఈ100 ఇంధనాలను వాటి కోసం ప్రత్యేకంగా రూపొందించిన, ధృవీకరించిన వాహనాల్లో మాత్రమే ఉపయోగించవచ్చని అధికారులు స్పష్టం చేశారు. వీటిని సాధారణ వాహనాల్లో ఉపయోగించకూడదు.
ఈ20 పెట్రోల్ లేదా సాధారణ ఇంధనంతో నడిచే వాహనాలు ఈ85 లేదా ఈ100 ఇంధనంతో నడవకూడదని ప్రభుత్వ ప్రకటన స్పష్టం చేస్తున్నది. ఈ కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటికే వాహనాలు కలిగి ఉన్నవారు తమ కార్లలో ఈ85 లేదా ఈ100 ఇంధనాన్ని వాడాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎటువంటి మార్పులు(మోడిఫికేషన్లు) చేయాల్సిన పని కూడా లేదు. ఇది వర్తమానానికి, భవిష్యత్తుకు సంబంధించి పూర్తిగా ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటు.
ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ
అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఫ్లెక్స్-ఫ్యూయల్ సాంకేతికతను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ వాహనాలు ఒకే ఇంధన ట్యాంకులో ఇథనాల్, పెట్రోల్‌ను వివిధ నిష్పత్తుల్లో కలిపి సులభంగా నడిచేలా ప్రత్యేకంగా రూపొందించారు. వాహన రూపకల్పన, ధృవీకరణను బట్టి ఇందులో ఉపయోగించే ఇథనాల్ మిశ్రమం ఈ85 నుంచి ఈ100 వరకు ఉండవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

