బీబీసీ కార్యాలయాల్లో 60 గంటల పాటు ఐటీ సోదాలు
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఢిల్లీ, ముంబైలోని ఆఫీసుల్లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సోదాలు.. దాదాపు 60 గంటల పాటు కొనసాగాయి. సోదాల్లో భాగంగా అధికారులు బీబీసీ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన
- సిబ్బందిని మూడ్రోజులు ఇంటికి పంపని అధికారులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఢిల్లీ, ముంబైలోని ఆఫీసుల్లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సోదాలు.. దాదాపు 60 గంటల పాటు కొనసాగాయి. సోదాల్లో భాగంగా అధికారులు బీబీసీ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన డాటా కాపీలు తీసుకొన్నారు. సంస్థ ఆర్థిక లావాదేవీలు, ఇతర వివరాలపై ఉద్యోగులను ప్రశ్నించారు.
సీనియర్ ఉద్యోగుల స్టేట్మెంట్ను రికార్డు చేయడంతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. అయితే సోదాల గురించి ఐటీ శాఖ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. సోదాల్లో భాగంగా పలువురు ఉద్యోగులను మూడు రోజులుగా అధికారులు ఇంటికి పంపలేదని సంబం ధిత వర్గాలు వెల్లడించాయి. మంగళవారం నుంచి 10 మంది ఉద్యోగులు ఢిల్లీ ఆఫీసులోనే ఉన్నారు. బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్రం నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మరో పిల్ దాఖలైంది.
కేంద్రానిది అణచివేత ధోరణి
బీబీసీపై ఐటీ సోదాలపై పలు జాతీయ ఇంగ్లిష్ పత్రికలు తమ సంపాదకీయాల్లో కేంద్రం చర్యలను తప్పుబట్టాయి. సోదాల టైమింగ్‌ను హైలెట్ చేసిన ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’.. ప్రతీకార చర్యల ప్రకియలో ఇది మొదటి అడుగు అని పేర్కొన్నది. తనకు వ్యతిరేకంగా ఉంటే మోదీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనే విషయాన్ని ‘టెలిగ్రాఫ్’ వివరించింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిపై ఇలాంటి చర్యలు సాధారణంగా మారాయని ‘ది హిందూ’ కేంద్రం తీరును ఎత్తిచూపింది. దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదని ‘ట్రిట్యూన్’ ఆందోళన వ్యక్తం చేసింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ బీబీసీపై ఐటీ సోదాల ద్వారా ప్రపంచానికి దేశ ప్రతిష్టను దెబ్బతీసే సందేశం పంపిందని ‘దక్కన్ క్రానికల్’ వ్యాఖ్యానించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

