కొవిడ్ యోధుల్లో జర్నలిస్టులను చేర్చండి : ప్రెస్ కౌన్సిల్

ఢిల్లీ : జర్నలిస్టులను కొవిడ్ యోధుల విభాగంలో చేర్చాలని అదేవిధంగా వారికి బీమా సౌకర్యం కూడా కల్పించాలని కోరుతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురువారం కేంద్రం, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫారసు చేసింది. ఈ కరోనా మహమ్మారి పరిస్థితుల్లో ఒడిశా, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఫ్రంట్ లైన్ వర్కర్స్‌లో జర్నలిస్టులు ఒకరిగా పరిగణించి వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపింది.
గత ఏడాది సెప్టెంబరులో తన తీర్మానాన్ని పునరుద్ఘాటిస్తూ హర్యానా ప్రభుత్వం రూపొందించిన పాలసీ ప్రకారం జర్నలిస్టుల కోసం గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని రూపొందించి అమలు చేయాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని పీసీఐ కోరింది. వైద్యుల వలె కొవిడ్ వారియర్స్‌గా జర్నలిస్టులను గుర్తించి వారికి అందించే ఆర్థిక ప్రయోజనాలనే కొవిడ్-19తో మరణించిన జర్నలిస్టులకు తక్షణం అందించాల్సిందిగా సిఫారసు చేసింది.
జర్నలిస్టుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోరింది. కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఒక్కరోజే 4,12,262 నూతన కరోనా కేసులు నమోదైనట్లు అదేవిధంగా కొవిడ్-19తో 3,980 మంది మృత్యువాత పడినట్లు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health | మానసిక లేదా శారీరక క్షోభను ఒక తరం అనుభవిస్తే అది భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపిస్తుందా..?
Harish Rao | కేసీఆర్ పాలనలో వలసలు తిరుగుముఖం.. రేవంత్ పాలనలో ఎడ్లబండ్లపై బలవంతపు వలసలు..!
‘లెక్చరర్ గోపాలకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి’
Nani | నాని కెరీర్లో కీలక నిర్ణయం.. ఇకపై అలాంటి సినిమాలకు దూరం..!
Man Kills Girlfriend | అనుమానంతో ప్రియురాలిని లాడ్జిలో హత్య చేసిన ప్రియుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

