కేరళలో అకాల వర్షాలు.. ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్
Kerala rains: కేరళలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉన్నది. పలు లోతట్టు ప్రాంతాల్లో

తిరువనంతపురం: కేరళలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉన్నది. పలు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదనీరు నిలిచిపోయింది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావం పథనంథిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నది. ఆ ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
అదేవిధంగా భారీ వర్షసూచన ఉన్న తిరువనంతపురం, కొల్లామ్, అలప్పుజ, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. రాష్ట్ర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. ప్రస్తుతం దక్షిణ, మధ్య ప్రాంత జిల్లాల్లో వర్షాలు తీవ్రంగా ఉన్నాయని, సాయంత్రానికి ఉత్తరాది జిల్లాల్లో కూడా తీవ్రతరం కావొచ్చని ఆయన తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

