Cop Suspended: పోలీస్ స్టేషన్లో మద్యం తాగిన వ్యక్తి.. ఆ ఘటనలో ఇంచార్జి పోలీసుపై వేటు
Uttarpradesh Police: యూపీ పోలీసు స్టేషన్లో ఓ వ్యక్తి మద్యం తాగాడు. ఆ ఘటనలో ఇంచార్జి పోలీసుపై వేటు వేశారు. హోళీ పండుగ వేళ జరిగిన ఈ ఘటనకు చెందిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
షహరాన్‌పూర్: యూపీలో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో మందు కొట్టాడు. ఈ ఘటనలో ఆ పోలీసు స్టేషన్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు. షహరాన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి చైర్లో కూర్చుని ఓ వ్యక్తి మందు సీసాతో గ్లాసులో మందు పోస్తున్న ఓ ఫోటో వైరల్ అయ్యింది. ఈ ఘటనలో ఆ స్టేషన్ ఇంచార్జ్‌ను సస్పెండ్(Cop suspended) చేశారు. షహరాన్‌పూర్‌లోని ఖాటా ఖేరి పోలీసు స్టేషన్లో ఘటన జరిగింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఇమ్రాన్‌గా గుర్తించారు. ఇంచార్జ్ ఆఫీసర్ సచిన్ త్యాగి చైర్లో కూర్చున్న అతను గ్లాసులో మందు పోస్తూ కనిపించాడు. టేబుల్‌పై చక్నా ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు కూడా ఉన్నాయి. మార్చిలో హోలీ పండుగ సమయంలో ఈ ఘటన జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఫోటో వైరల్ కాగానే.. ఇంచార్జి సచిన్ త్యాగిపై ఎస్ఎస్పీ విపిన్ తాడా సస్పెన్షన్ విధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

