Tomato Prices | తమిళనాడులో కిలో టమాట రూ.200.. ధరలు మరింతగా పెరిగే అవకాశం
Tomato Prices | టమాట ధరలు (Tomato Prices) దిగిరావడం లేదు. తాజాగా తమిళనాడులో టమాట ధరలు కిలో రూ.200గా ఉన్నాయి. చెన్నైలోని కొన్ని హోల్సేల్ మార్కెట్లలో కిలో రూ.185 నుంచి రూ.200 వరకు అమ్ముతున్నారు.
చెన్నై: టమాట ధరలు (Tomato Prices) దిగిరావడం లేదు. తాజాగా తమిళనాడులో టమాట ధరలు కిలో రూ.200గా ఉన్నాయి. చెన్నైలోని కొన్ని హోల్సేల్ మార్కెట్లలో కిలో రూ.185 నుంచి రూ.200 వరకు అమ్ముతున్నారు. కోయంబేడు హోల్సేల్ మార్కెట్ ప్రారంభమైన తర్వాత టమాట ధరలు కిలో రూ.200 చేరడం ఇదే తొలిసారి అని ఆ మార్కెట్ వ్యాపారుల సంఘం కార్యదర్శి పీ సుకుమారన్ తెలిపారు. ఇది అసాధారణమని అన్నారు. ఆకాశాన్నంటిన టమాట ధరలు జూలై 20 తర్వాత సాధారణస్థితికి వస్తాయని తాము భావించినట్లు చెప్పారు. అయితే ఊహించని విధంగా కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 50 శాతంపైగా టమాట పంటలు నాశనమయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో వారం రోజుల్లో కిలో టమాట ధర రూ.250 దాటవచ్చని ఆయన అంచనా వేశారు.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో టమాట ధరలు గరిష్ఠంగా ఉన్నాయి. జూలైకు ముందు కేజీ రూ.20 నుంచి రూ.30 ఉన్న టమాట ధరలకు అనంతరం రెక్కలు వచ్చాయి. పంట దిగుబడి లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో కిలో టమాట ధరలు రూ.110 నుంచి రూ.160 వరకు పెరిగాయి. అయితే దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు టమాట పంటలు సగానికిపైగా నాశనం అయ్యాయి. ఈ నేపథ్యంలో వీటి ధరలు తగ్గేందుకు మరికొంత కాలం పట్టవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

