Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి భూవివాదం.. సర్వేకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి భూవివాదం గురించి ఇవాళ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. మధురలోని షాహీ ఇద్గా మసీదులో సర్వే చేపట్టాలని హైకోర్టు తెలిపింది. అయితే సర్వే కమీషనర్ గురించి సోమవారం కోర్టు ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో కూడా కోర్టు ఆదేశాల ప్రకారం సర్వే చేపట్టిన విషయం తెలిసిందే.
ప్రయాగ్‌రాజ్: యూపీలోని మధురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి(Krishna Janmabhoomi) భూవివాదం గురించి ఇవాళ అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మధురలోని షాహీ ఇద్గా మసీదులో సర్వే చేపట్టాలని హైకోర్టు తెలిపింది. అయితే సర్వే నిర్వహించేందుకు కావాల్సిన ప్యానెల్ సభ్యుల గురించి సోమవారం కోర్టు ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో కూడా కోర్టు ఆదేశాల ప్రకారం సర్వే చేపట్టిన విషయం తెలిసిందే.
షాహి ఈద్గా మసీదును 17వ శతాబ్ధంలో నిర్మించారు. కోర్టు నియమిత కమీషనర్ ఆధ్వర్యంలో సర్వే చేపట్టనున్నారు. శ్రీ కృష్ణుడు జన్మించిన స్థలంలో ముస్లింలు మసీదు నిర్మించినట్లు హిందూవాదులు ఆరోపిస్తున్నారు. హిందూ సేనకు చెందిన విష్ణు గుప్త సర్వే కోసం డిమాండ్‌చేశారు. విష్ణు గుప్త దాఖలు చేసిన పిటీషన్‌ను స్థానిక కోర్టు గత డిసెంబర్లో స్వీకరించింది. అయితే ముస్లింలు అభ్యంతరం పిటీషన్ దాఖలు చేశారు. తాజా తీర్పును వ్యతిరేకిస్తూ ముస్లింలు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.
శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్న మొత్తం 13.37 ఎకరాల భూమిపై హిందువులకే హక్కును కల్పించాలని హిందూసేన డిమాండ్ చేస్తోంది. ఇక్కడ ఉన్న కాట్ర కేశవ దేవ్ ఆలయాన్ని కూల్చి.. దాని స్థానంలో మసీదును నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాలతో ఆ అక్రమ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది.
శ్రీ కృష్ణ జన్మస్థానం గురించి 1968లో ఓ ఒప్పందం జరిగింది. సేవా సంస్థాన్, షాహీ మజీద్ ఈద్గా ట్రస్టు మధ్య సంతకాలు జరిగాయి. ఆ ఒప్పందం ప్రకారం శ్రీకృష్ణ జన్మభూమికి 10.9 ఎకరాలు, మసీదుకు 2.6 ఎకరాలు ఇవ్వడం జరిగింది. కృష్ణ జన్మభూమి-షాహి మజ్జీద్ మధ్య మొత్తం 18 ఎకరాల గురించి వివాదం ఉన్నట్లు స్పష్టమవుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

