Manipur violence | మణిపూర్‌లో ఆగని హింస.. పోలీస్ చెక్ పోస్ట్, లారీకి నిప్పు
Manipur violence | మణిపూర్‌లో హింస కొనసాగుతున్నది. సాయుధ మిలిటెంట్లు పోలీస్ చెక్ పోస్ట్‌తోపాటు ఒక లారీకి నిప్పుపెట్టారు. ఉత్తర కాంగ్పోక్పి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ఇంఫాల్: మణిపూర్‌లో హింస కొనసాగుతున్నది. (Manipur violence) సాయుధ మిలిటెంట్లు పోలీస్ చెక్ పోస్ట్‌తోపాటు ఒక లారీకి నిప్పుపెట్టారు. ఉత్తర కాంగ్పోక్పి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి 11.30 సమయంలో కాంగ్పోక్పి పట్టణంలోకి సరుకులు రవాణా చేస్తున్న లారీని కొందరు దుండగులు తగులబెట్టారు. నేషనల్ హైవే 102లోని కాన్పోక్పి, చాంగోబంగ్ గ్రామం మధ్యలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆ వాహనం మైతీ వర్గానికి చెందినదిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
కాగా, మరో సంఘటనలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో జిరిబామ్ జిల్లాలోని లింగాంగ్పోక్పి వద్ద నార్కోటిక్ ఖాళీ చెక్ పోస్ట్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అయితే సాయుధులైన దుండగులు కాల్పులు జరుపగా ఎదురు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- check post
- Manipur
- set ablaze
- Truck
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

