అసదుద్దీన్‌కు షాక్.. ఎంఐఎంను వీడిన బెంగాల్ చీఫ్

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందే ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ బెంగాల్ చీఫ్ జమీరుల్ హసన్ పార్టీ నుంచి తప్పుకున్నారు. ఆయన ఇండియన్ నేషనల్ లీగ్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జమీరుల్ మీడియాతో మాట్లాడుతూ బెంగాల్ 95శాతం మంది కార్యకర్తలు నాతోనే ఉన్నారన్నారు. బీజేపీ కోసం పని చేసేందుకే అసద్ బెంగాల్‌కు వచ్చారని, అందుకే అబ్బాస్ సిద్దిఖీతో సమావేశమయ్యారని ఆరోపించారు. నందిగ్రామ్‌లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా బలమైన పోటీదారులందరికీ మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. నందిగ్రామ్‌లో మమతా బెనర్జీకి మద్దతు ఇస్తున్నామని, తద్వారా సువేందు అధికారి గెలవలేరన్నారు. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో మార్చి 27వ తేదీ నుంచి ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. చివరి దశ ఎన్నికలో ఏప్రిల్ 29న జరుగనుండగా.. ఓట్ల లెక్కింపు మే 2న జరుగుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ -వామపక్షాలు, బీజేపీ మధ్య ఈసారి పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

