Siddaramaiah | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై.. కేసు నమోదు చేసిన లోకాయుక్త
Siddaramaiah | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఆ రాష్ట్ర అవినీతి నిరోధక సంఘమైన లోకాయుక్త కేసు నమోదు చేసింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్యను ఏ1 నిందితుడిగా, ఆయన భార్య పార్వతిని ఏ2గా, బావమరిది మల్లికార్జున్ స్వామిని ఏ3గా, భూమి అమ్మిన దేవరాజ్‌ను ఏ4గా ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై (Siddaramaiah) ఆ రాష్ట్ర అవినీతి నిరోధక సంఘమైన లోకాయుక్త కేసు నమోదు చేసింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్యను ఏ1 నిందితుడిగా, ఆయన భార్య పార్వతిని ఏ2గా, బావమరిది మల్లికార్జున్ స్వామిని ఏ3గా, భూమి అమ్మిన దేవరాజ్‌ను ఏ4గా ఎఫ్ఐఆర్లో పేర్కొంది. కోట్ల విలువైన భూమిని దేవరాజ్ నుంచి మల్లికార్జున్ స్వామి కొనుగోలు చేశాడు. ఆ భూమిని అక్క పార్వతికి గిఫ్ట్‌గా ఇచ్చాడు.
కాగా, మైసూరు అభివృద్ధి సంస్థ పార్వతి నుంచి 3.16 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నది. ఎక్కువ విలువైన ప్లాట్లను పరిహారంగా ఆమెకు ఇచ్చింది. అయితే చట్టవిరుద్ధమైన భూ పరిహార ఒప్పందం వల్ల సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య సుమారు రూ.4,000 కోట్ల మేర లబ్ది పొందినట్లు ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేసేందుకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆగస్టులో అనుమతి ఇచ్చారు. సెప్టెంబర్ ఆరంభంలో గవర్నర్ అనుమతిని కర్ణాటక హైకోర్టు సమర్థించింది.
మరోవైపు ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన ఫిర్యాదుపై మైసూరులోని లోకాయుక్త స్పందించింది. ఈ భూ స్కామ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య, బావమరిదితో పాటు మరో వ్యక్తిపై లోకాయుక్త పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

