Akhilesh Yadav | అక్రమ మైనింగ్ కేసులో.. అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు
Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఫిబ్రవరి 29న తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఫిబ్రవరి 29న తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. అఖిలేష్ యాదవ్‌ను ఈ కేసులో సాక్షిగా సీబీఐ గురువారం ప్రశ్నించనున్నది.
కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ఏడు జిల్లాలైన షామ్లీ, కౌశాంబి, ఫతేపూర్, డియోరియా, సహరాన్పూర్, హమీర్పూర్, సిద్ధార్థనగర్‌లో అక్రమ మైనింగ్ కేసులు నమోదయ్యాయి. 2012-2016 మధ్య ప్రభుత్వ అధికారులు నియమాలు, నిబంధనలను ఉల్లంఘించి మైనింగ్ సైట్లను కొందరికి అక్రమంగా కేటాయించినట్లు సీబీఐ ఆరోపించింది. ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించి మైనింగ్ హక్కులు ఇచ్చినట్లు అభియోగాలు మోపింది. 2012- 2013 జూన్ మధ్య మైనింగ్ శాఖ నిర్వహించిన అఖిలేష్ యాదవ్‌ను సాక్షిగా విచారణకు రావాలంటూ సీబీఐ సమన్లు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

