న్యూఢిల్లీ : దారితప్పిన గొర్రె పిల్లను తిరిగి తల్లి చెంతకు చేర్చిన చిన్నారి వీడియో (Viral Video) సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ వైరల్ క్లిప్‌లో బాలుడు గొర్రె పిల్లకు తన తల్లి ఎక్కడుందో చూపుతుండటం కనిపిస్తుంది. తప్పిపోయిన గొర్రెపిల్ల తల్లి వద్దకు చేరడంతో ఈ వీడియో ముగుస్తుంది. తప్పిపోయిన గొర్రెపిల్లను తల్లి చెంతకు చేర్చేందుకు సాయపడిన చిన్నారి అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
Kid helps reunite a lost lamb with its mother…🐑🧒❤️ pic.twitter.com/xOVNGfZgAE
— 𝕐o̴g̴ (@Yoda4ever) May 14, 2023
ఈ పోస్ట్‌ను ఇప్పటివరకూ 13 లక్షల మందికిపైగా వీక్షించగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. ఈ వీడియో ఎంత స్వీట్‌గా ఉందని పలువురు యూజర్లు రాసుకొచ్చారు. తల్లి కోసం గొర్రెపిల్ల తల్లడిల్లిన తీరు హృదయాన్ని హత్తుకుందని కామెంట్ చేశారు. గొర్రెపిల్లకు సాయం చేసిన చిన్నారిపై యూజర్లు ప్రశంసలు గుప్పించారు.
Read More