viral video | యాపిల్ ఆమ్లెట్ మేకింగ్ వీడియో వైరల్
viral video : పండ్లు ముఖ్యంగా యాపిల్ మన దైనందిన జీవితంలో తరచూ తీసుకుంటూ ఉంటాం. అత్యవసర పోషకాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండిఉండే ఈ సూపర్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతుంటారు.
viral video : పండ్లు ముఖ్యంగా యాపిల్ మన దైనందిన జీవితంలో తరచూ తీసుకుంటూ ఉంటాం. అత్యవసర పోషకాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండిఉండే ఈ సూపర్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. యాపిల్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. ఈ వండర్ ఫ్రూట్ రోగనిరోధక వ్యవస్ధను బలోపేతం చేస్తుంది.
ఇక ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే ఎగ్స్ కండరపుష్టికి దోహదపడటంతో పాటు శరీర ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. ఇక ఈ రెండు ఆహార పదార్ధాలను మిక్స్ చేస్తూ ఓ వీధి వ్యాపారి యాపిల్ ఆమ్లెట్ తయారుచేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
అయితే జనాలు మాత్రం ఇదేం విచిత్ర కాంబినేషన్ అంటూ ఓ రేంజ్లో ఫైరయ్యారు. అతడికి ఎగ్స్ సప్లై చేయడం నిలిపివేయండని ఓ యూజర్ కామెంట్ చేయగా నేను దీన్ని ఎప్పటికీ ట్రై చేస్తాననుకోవడం లేదని మరో యూజర్ రాసుకొచ్చారు. ఈ కాంబినేషన్‌ను కలలో కూడా తలుచుకోనని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More :
Pizza Cold Drink Combo | ఈ ఫుడ్ కాంబినేషన్‌తో ఆరోగ్యానికి పెను ముప్పు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

