న్యూఢిల్లీ : ఓ నేవీ అధికారి ఎవర్గ్రీన్ హిట్ సాంగ్ ఘర్ సే నికాల్తే పాటను అద్భుతంగా ఆలపించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సోల్‌ఫుల్ వాయిస్‌తో నెటిజన్లను కట్టిపడేసిన అధికారిని వైస్ అడ్మిరల్ గిరీష్ లూథ్రా (రిటైర్డ్)గా గుర్తించారు.
पूरे दिल से सुनिएगा इसको ❤️ pic.twitter.com/RtAGJbqio7
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 13, 2022
నెట్టింట తెగ వైరలవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకూ 61,000 మంది వీక్షించారు. ఓ ఫంక్షన్లో నేవీ అధికారి తన గాత్రంతో ఆహుతులను ఆకట్టుకున్నట్టు ఈ వీడియోలో కనిపించింది. పాపా కెహ్తే ఐ మూవీ నుంచి రిటైర్డ్ నేవీ అధికారి పాటను ఆలపించారు. జుగల్ హన్స్‌రాజ్, మయూరి కాంగోపై చిత్రీకరించిన ఈ పాట అప్పట్లో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.గిరీష్ లూథ్రా తన యూనిఫాంలో స్టేజ్‌పై పాడుతూ కనిపించారు. లూథ్రా గాన నైపుణ్యాలను నెటిజన్లు ప్రశంసించారు.