న్యూఢిల్లీ : ప్రముఖ దేశీ స్నాక్ పానీ పూరీ అంటే అందరూ ఇష్టంగా ఆరగిస్తారు. ఈ టేస్టీ స్నాక్‌ను రుచిచూసేందుకు కొరియన్ వ్యక్తి వీధుల్లోకి (viral video) రావడం ఆకట్టుకుంది. కొరియన్ యూట్యూబర్ లడ్కా భారత్‌లో ఐదేండ్ల నుంచి నివసిస్తున్నారు.
భారత్‌లో తన అనుభవాలను లడ్కా షార్ట్ వీడియోల ద్వారా ప్రపంచానికి చేరవేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రాంలో ఇటీవల అతడు పోస్ట్ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో స్ట్రీట్ ఫుడ్ వెండర్ నుంచి లడ్కా పానీ పూరీని టేస్ట్ చేయడం కనిపిస్తుంది.
ముందుగా పానీ పూరీని ఆరగించిన అతడు ఆపై టేస్ట్ బావుందంటూ మరికొన్ని తినడం చూడొచ్చు. తాను స్ట్రీట్ పానీ పూరీని ట్రై చేశానని, మీకు ఇష్టమైన దేశీ స్ట్రీట్ ఫుడ్ గురించి కామెంట్స్ సెక్షన్లో తనకు తెలియచేస్తే మరోసారి తాను వాటిని ప్రయత్నిస్తానని పోస్ట్‌లో లడ్కా రాసుకొచ్చారు.
Read More