ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ : శివసేన నేతగా ఏక్నాథ్ షిండే ఎన్నిక..పాత కార్యవర్గం రద్దు!
శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముంబైలో సోమవారం సమావేశమైన ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యేలు పార్టీ అధినేతగా సీఎం షిండేను ఎన్నుకుంటూ తీర్మానాన్ని ఆమోదించారు.
ముంబై : శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముంబైలో సోమవారం సమావేశమైన ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యేలు పార్టీ అధినేతగా సీఎం షిండేను ఎన్నుకుంటూ తీర్మానాన్ని ఆమోదించారు. గతంలో ఠాక్రే ఏర్పాటు చేసిన కార్యవర్గాన్ని రద్దు చేస్తూ శివసేన నూతన జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మరో తీర్మానాన్ని షిండే వర్గం ఆమోదించింది.
ఎమ్మెల్యే దీపక్ కెసర్కర్ను పార్టీ ప్రతినిధిగా నియమించగా రాందాస్ కదమ్, మాజీ ఎంపీ ఆనంద్ రావు అద్సుల్‌ను శివసేన నేతలుగా నియమించారు. యశ్వంత్ జాదవ్, గులాబ్‌రావు పాటిల్, ఉదయ్ సామంత్, శరద్ పోంక్షే, తానాజీ సావంత్, విజయ్ నహతా, శివాజీరావు పాటిల్‌ను డిప్యూటీ నేతలుగా నియమించారు.
మహా వికాస్ అఘడి ప్రభుత్వం కూలిపోయేందుకు దారితీసిన పరిణామాలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను ఈనెల 20న సుప్రీంకోర్టు విచారించనున్న నేపధ్యంలో శివసేన చీఫ్‌గా షిండేను రెబెల్ గ్రూపు ఎన్నుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో ఉద్ధవ్ ఠాక్రే బలనిరూపణకు ముందే సీఎంగా వైదొలగడంతో జూన్ 30న మహారాష్ట్ర నూతన సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

