న్యూఢిల్లీ : వయసు కేవలం ఓ అంకె మాత్రమేనని ఆ బామ్మ చాటిచెప్పింది. వయసు శరీరానికే కాని మనోధైర్యం, సంక్పలం ముందు అది చిన్నబోతుందని వెల్లడించింది. చికాగోకు చెందిన 104 ఏండ్ల డరోతీ హాఫ్నర్ విమానం నుంచి దూకి స్కైడైవ్ (skydiving) చేసిన అత్యంత వృద్ధ మహిళగా రికార్డు సాధించింది. ఈ ఘటనకు సంబంధించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ పరిశీలన ప్రక్రియ పెండింగ్‌లో ఉంది.
బామ్మ స్కైడైవింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ క్లిప్‌లో స్కైడైవ్ చేసేందుకు బామ్మ తన వాకర్‌ను పక్కనపెడుతుండటం కనిపిస్తుంది. ఆపై విమానంలోకి ఎంట్రీ ఇచ్చి గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో స్కైడైవింగ్‌కు పూనుకోవడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటో్ంది.
స్కైడైవింగ్ అనుభవం చాలా సరదాగా సాగిందని, పారాచూట్‌తో కిందకు దిగడం కూల్‌గా, అద్భుతంగా అనిపించిందని ఆమె సీఎన్బీసీతో చెప్పుకొచ్చారు. స్కైడైవింగ్ రికార్డును హాఫ్నర్ తిరగరాసిన వీడియోను స్కైడైవ్ చికాగో నెట్టింట అప్లోడ్ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక వయసున్న స్కైడైవర్ అయ్యేందుకు హాఫ్నర్కు సహకరించడం మరపురాని విషయమని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
Read More :