‘మొలాసిస్ పొటాష్’కూ రాయితీ

- తొలిసారిగా ఎన్బీఎస్ పరిధిలోకి…
- 50 కిలోల బస్తాకు రూ.73 సబ్సిడీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 14: మొలాసిస్ నుంచి తయారుచేసే పొటాష్ (పీడీఎం)పై రాయితీని నిర్ణయించినట్టు కేంద్రం గురువారం తెలిపింది. పోషకాధార రాయితీ (ఎన్బీఎస్) పరిధిలోకి పీడీఎంను తీసుకురావడం ఇదే మొదటిసారి. ఇది మినరల్ ఆధారిత పొటాష్పై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది. ఎరువుల కంపెనీలు రైతులకు రూ.600-800కు విక్రయించే 50 కిలోల పీడీఎం బస్తాపై రూ.73 రాయితీ ఇస్తామని తెలిపింది. ‘ఈ నిర్ణయంతో ఉప ఉత్పత్తిగా మొలాసిస్‌ను తయారుచేసేందుకు చక్కెర మిల్లులు ఆసక్తి చూపుతాయి. తద్వారా మిల్లులతో పాటు చెరకు రైతుల ఆదాయం పెరుగుతుంద’ని పేర్కొంది. అంతేకాక పూర్తిగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంవోపీ) దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని తెలిపింది. ప్రస్తుతం ఏడాదికి రూ.7,160 కోట్ల విలువైన 42 లక్షల టన్నుల ఎంవోపీని దిగుమతి చేసుకుంటున్నట్టు వివరించింది. ఇప్పటి వరకు మట్టి పోషకాలైన నత్రజని (ఎన్), ఫాస్పేట్ (పీ), పొటాష్ (కే), సల్ఫర్ (ఎస్) ఉన్న 22 రకాల ఎరువులకే ఎన్బీఎస్ కింద కేంద్రం రాయితీ ఇస్తున్నది. ఈ ఏడాది మేలో ఎన్బీఎస్ కింద రెండు కాంప్లెక్స్ ఎరువులను కూడా చేర్చింది. తాజాగా పీడీఎంను కూడా చేర్చడంతో మొత్తం రకాల సంఖ్య 25కు పెరిగింది. అలాగే ఫాస్పేట్, పొటాష్ ఎరువులపై రాయితీని అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. ప్రత్యేక వన్-టైమ్ ప్యాకేజీ కింద డీఏపీపై రాయితీని బస్తాకు రూ.438 పెంచింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ధరలపై దండెత్తిన మహిళలు
ఇద్దరు మైనర్లపై లైంగికదాడి నిందితుల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

