Stray Dog’s Death Revenge | వీధి కుక్కను చంపినందుకు ప్రతీకారం.. ముగ్గురిని కత్తితో పొడిచిన ఐఐటీయన్
Stray Dog’s Death Revenge | వీధి కుక్కను చంపిన వారిపై ఐఐటీయన్ ప్రతీకారం తీర్చుకున్నాడు. స్నేహితురాలి ద్వారా ఈ విషయం తెలిసి సొంతూరుకు చేరుకున్నాడు. ఆమె పొరుగింటికి చెందిన ముగ్గురిపై కత్తితో దాడి చేశాడు.
కోల్‌కతా: వీధి కుక్కను చంపిన వారిపై ఐఐటీయన్ ప్రతీకారం తీర్చుకున్నాడు. స్నేహితురాలి ద్వారా ఈ విషయం తెలిసి సొంతూరుకు చేరుకున్నాడు. ఆమె పొరుగింటికి చెందిన ముగ్గురిపై కత్తితో దాడి చేశాడు. (Stray Dog’s Death Revenge) తీవ్రంగా గాయపడిన కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. సోనార్‌పూర్‌లోని చౌహతి ప్రాంతంలో దేబ్నాథ్, గోబిందో అధికారి కుటుంబాలు నివసిస్తున్నాయి. దేబ్నాథ్ కుటుంబం వీధి కుక్కలకు ఆహారం పెట్టడంపై గోబిందో కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. వీధి కుక్కలు తమ ఇంట్లోకి వస్తున్నాయని ఆరోపించడంతో ఈ రెండు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా వివాదం నెలకొన్నది.
కాగా, మే నెలలో గోబిందో అధికారి కుటుంబం ఒక వీధి కుక్కను కొట్టగా కొన్ని రోజుల తర్వాత అది మరణించింది. దేబ్నాథ్ కుటుంబానికి చెందిన స్మృతి దేబ్నాథ్ దీనిపై తీవ్ర కలత చెందింది. ఐఐటీ మద్రాస్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న స్నేహితుడైన అర్చన్ భట్టాచార్యకు ఈ విషయం చెప్పింది.
మరోవైపు వీధి కుక్కను చంపడంతోపాటు స్నేహితురాలి కుటుంబాన్ని వేధిస్తున్న ఆమె పొరుగింటి కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని అర్చన్ భావించాడు. వెంటనే చెన్నై నుంచి కోల్‌కతా చేరుకున్నాడు. గోబిందో అధికారి, అతడి భార్య, కుమారుడిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ ముగ్గురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అర్చన్ను శనివారం అరెస్ట్ చేశారు. హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Death Revenge
- IITian
- Kolkata
- stabs
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

