IIT Delhi | ఐఐటీ ఢిల్లీ హాస్టల్ మెస్‌లో ఫుడ్ పాయిజనింగ్.. విద్యార్థులకు అస్వస్థత
IIT Delhi | ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ మెస్‌లో లిట్టి చోఖా తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారినపడ్డారు.
న్యూఢిల్లీ: ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీ ఢిల్లీ (IIT Delhi) విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ మెస్‌లో లిట్టి చోఖా తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారినపడ్డారు. దీంతో కొంత మంది విద్యార్థులకు క్యాంపస్‌లో చికిత్స అందించగా, మరికొందరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు మండిపడ్డారు. ఫుడ్ కోసం డబ్బులు చెల్లించి కలుషిత ఆహారం తింటున్నామని కొందరు స్టూడెంట్స్ ఆరోపించారు. హాస్టల్ మొత్తం రాత్రంతా రోగుల వార్డుగా మారిపోయిందని విమర్శించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో అందిస్తున్న ఆహారం నాణ్యతపై సోషల్ మీడియా పోస్ట్‌లో మండిపడ్డారు.
కాగా, ఐఐటీ ఢిల్లీ సంస్థ ఈ ఆరోపణలను ఖండించింది. బాయిస్ హాస్టల్లోని విద్యార్థులు బయట వ్యక్తి అమ్మిన స్వీట్లు తిన్నారని, దీని వల్ల వారికి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపించినట్లు తెలిపింది. అయితే ఈ సంఘటన నేపథ్యంలో ఏప్రిల్ 30న జరుగాల్సిన పరీక్షను మే 8కి వాయిదా వేసినట్లు పేర్కొంది. మిగిలిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

