కులం గురించి అడగొద్దు.. ఐఐటీ బాంబే
ఇక నుంచి ఐఐటీలో ఎవరూ తోటి విద్యార్థుల కులం, క్యాటగిరీ, ర్యాంకుల గురించి అడగొద్దని, ఆరా తీయొద్దని ఐఐటీ బాంబే ఆదేశించింది. మంగళవారం రాత్రి విద్యార్థులందరికీ ఈ మెయిల్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ఇటీవల రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 26 రోజులుగా సంస్థ ప్రధాన గేటు వద్ద ఉన్న జస్టిస్ కార్నర్లో విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు.
ముంబై : ఇక నుంచి ఐఐటీలో ఎవరూ తోటి విద్యార్థుల కులం, క్యాటగిరీ, ర్యాంకుల గురించి అడగొద్దని, ఆరా తీయొద్దని ఐఐటీ బాంబే ఆదేశించింది. మంగళవారం రాత్రి విద్యార్థులందరికీ ఈ మెయిల్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ఇటీవల రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 26 రోజులుగా సంస్థ ప్రధాన గేటు వద్ద ఉన్న జస్టిస్ కార్నర్లో విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఐటీ విద్యార్థి వ్యవహారాల డీన్ కార్యాలయం ఈ ప్రకటన చేసింది. తోటి విద్యార్థి కులం లేదా క్యాటగిరీ అడిగితే అది వివక్షకు దారి తీస్తుందని స్పష్టం చేసింది. అడిగేవారికి అది సహజమైన ప్రశ్నగా అనిపించినా.. అవతలి వారికి అది వివక్షగా కనిపిస్తుందని వెల్లడించింది. అలాగే జేఈఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా ర్యాంకులు, గేట్ స్కోర్లు కూడా అడగొద్దని చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

