IIT Baba : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) లో ఇటీవల ముగిసిన మహా కుంభమేళా (Maha Kumbh) లో ఐఐటీ బాబా (IIT Baba) గా ఫేమస్ అయిన అభయ్ సింగ్ (Abhay Singh) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోతుందని చెప్పి అట్టర్ ప్లాప్ అయిన బాబా సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఆ విషయం మరువక ముందే ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఓ హోటల్లో గంజాయి స్వీకరిస్తూ దొరకడంతో జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై విడిచిపెట్టారు.
ఐఐటీ బాబా రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఓ హోటల్లో ఉన్నాడని, ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఇవాళ మధ్యాహ్నం పోలీసులకు సమాచారం వచ్చింది. దాంతో ఆ హోటల్‌కు వెళ్లి పరిశీలించగా బాబా గంజాయి మత్తులో జోగుతూ కనిపించాడు. పోలీసులు ప్రశ్నించగా గంజాయి తీసుకున్నానని ఒప్పుకున్నాడు. దాంతో పోలీసులు ఆయనను ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ చేశారు. అనంతరం కొద్ది మొత్తంలోనే గంజాయి సేవించాడని గుర్తించి ష్యూరిటీ తీసుకుని బెయిల్‌పై విడిచిపెట్టారు.
అంతకుముందు ఐఐటీ బాబా ఆత్మహత్య చేసుకుంటున్నాడని ఆయన అభిమానులు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై బాబాను ప్రశ్నించగా తాను పుట్టినరోజు సందర్భంగా హ్యాపీనెస్ కోసం గంజాయి సేవించానని, ఆత్మహత్య చేసుకుంటున్నాననే విషయాన్ని గంజాయి మత్తులోనే చెప్పి ఉంటానని చెప్పాడు. అవసరమైత ఐఐటీ బాబాను మరోసారి పిలిచి ఇంటరాగేట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
పోలీసులు బెయిల్‌పై విడిచిపెట్టిన అనంతరం ఐఐటీ బాబాను మీడియా ప్రశ్నించగా.. ఈ అంశంపై తాను ఇప్పుడేమీ మాట్లాడబోనని చెప్పారు. ఇవాళ తన పుట్టినరోజు అని, పుట్టినరోజు పూట తాను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
#WATCH | Jaipur, Rajasthan | Baba Abhay Singh aka IIT Baba, says, “I have nothing to say about it as of now. It’s my birthday, and I want to be happy today.” https://t.co/dAHkw551ZP pic.twitter.com/HDYp8CT3tk
— ANI (@ANI) March 3, 2025