Health tips | రోజూ ఈ గింజలు తింటే కొవ్వు ఐస్‌లా కరిగిపోతుంది తెలుసా..?
Health tips | ఈ మధ్య కాలంలో చాలామంది హై కొలెస్ట్రాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలామంది రక్తంలో కొవ్వు సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఇందుకు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బుల బారినపడే ప్రమాదం ఉంది.
Health tips : ఈ మధ్య కాలంలో చాలామంది హై కొలెస్ట్రాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలామంది రక్తంలో కొవ్వు సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఇందుకు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బుల బారినపడే ప్రమాదం ఉంది. కొలెస్టరాల్ తగ్గడానికి కొన్ని రకాల గింజలు మేలు చేస్తాయి. వాటిలో ఫైబర్‌తోపాటు మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆ గింజలను ఆహారంగా తీసుకోవడంవల్ల కొవ్వు సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. మరి ఆ గింజలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అవిసె గింజలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటినే లీన్ సీడ్స్ అని కూడా అంటారు. ఈ గింజల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి తోడ్పడుతాయి. కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించడంలో చియా విత్తనాలు కూడా దోహదపడతాయి. వీటిలో కూడా ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి దోహదపడతాయి.
అదేవిధంగా జనపనార విత్తనాలను తీసుకోవడంవల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ప్రోటీన్‌తోపాటు గామా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. కొలెస్టరాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి చక్కగా పనిచేస్తాయి. గుమ్మడి గింజలు కూడా కొవ్వును తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. ఈ గింజలల్లో ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్, మోనో శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. నువ్వులకు కూడా కొవ్వును తగ్గించే గుణం ఉంది. వీటిలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కడుపులో మంటను తగ్గించడంలో, కొవ్వును కరిగించడంలో ఇవి సాయపడతాయి.
రక్తంలో కొవ్వు సమస్యతో బాధపడేవారు పొద్దుతిరుగుడు గింజలను తీసుకోవడంవల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో విటమిన్ ‘ఇ’ తోపాటు మోనో శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి సాయపడుతాయి. నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల కూడా చెడు కొవ్వు తగ్గుతుంది. వీటితో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

