IAF’s Aircraft Debris | ఏడేళ్ల కిందట 29 మందితో ఐఏఎఫ్ విమానం అదృశ్యం.. తాజాగా శకలాలు గుర్తింపు
IAF’s Aircraft Debris | సుమారు ఏడేళ్ల కిందట 29 మందితో టేకాఫ్ అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన విమానం అదృశ్యమైంది. (IAF’s Aircraft Debris ) ఆ విమానం శకలాలను తాజాగా గుర్తించారు.
న్యూఢిల్లీ: సుమారు ఏడేళ్ల కిందట 29 మందితో టేకాఫ్ అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన విమానం అదృశ్యమైంది. (IAF’s Aircraft Debris ) ఆ విమానం శకలాలను తాజాగా గుర్తించారు. 2016 జూలై 22న ఉదయం 8 గంటలకు ఐఏఎఫ్‌కు చెందిన ఆంటోనోవ్ ఏఎన్-32 రవాణా విమానం కే-2743 చెన్నైలోని తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి టేకాఫ్ అయ్యింది. సిబ్బందితో సహా 29 మందితో వారాంతపు పర్యటన కోసం అండమాన్, నికోబార్ దీవులకు బయలుదేరింది. పోర్ట్ బ్లెయిర్‌లోని భారత నౌకాదళ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ ఉత్క్రోష్‌లో విమానం ల్యాండ్ కావాల్సి ఉంది.
కాగా, బంగాళాఖాతం సముద్రం మీదుగా ఎగిరిన ఐఏఎఫ్ విమానం కొంత సేపటికి అదృశ్యమైంది. రాడార్‌తో సంబంధాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆ విమానం కోసం సైనిక దళాలు మూడు నెలలపాటు విస్తృతంగా బంగాళాఖాతంలో సెర్చ్ చేశాయి. ఫలితం లేకపోవడంతో ఆ విమానంలోని 29 మంది మరణించి ఉంటారని ఐఏఎఫ్ ప్రకటించింది. 2016 సెప్టెంబర్ 15న ఈ మేరకు ఆయా కుటుంబాలకు లేఖలు పంపింది.
మరోవైపు చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలను గుర్తించారు. వాటి ఫొటోలను పరిశీలించిన తర్వాత ఐఏఎఫ్‌కు చెందిన ఏఎన్-32 విమానానికి చెందిన శకలాలుగా నిర్ధారించారు. బంగాళాఖాతంలోని ఆ ప్రాంతంలో ఏ విమానం కూలిన సంఘటనలు లేకపోవడంతో ఐఏఎఫ్ కే-2743 విమానం శకలాలుగా భావిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

