Puducherry CM : నటుడు, తమిళిగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ (Vijay) ని పుదుచ్చేరి ముఖ్యమంత్రి (Puducherry CM) రంగస్వామి (Rangaswamy) కృతజ్ఞతలు తెలిపారు. పుదుచ్చేరిలో మంగళవారం జరిగిన విజయ్ బహిరంగ సభ (Public rally) కు రంగస్వామి ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఈ విషయాన్ని విజయ్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. రంగస్వామి ప్రభుత్వం తమ పార్టీకి ప్రత్యర్థి అయినప్పటికీ తమ సభకు తగినవిధంగా భద్రతా ఏర్పాట్లు చేసిందని కొనియాడారు. అంతేగాక తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. రాష్ట్రపాలన ఎలా చేయాలో పుదుచ్చేరి సీఎంను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.
ఈ విషయాన్ని మీడియా పుదుచ్చేరి సీఎం రంగస్వామి ముందు ప్రస్తావించగా ఆయన విజయ్‌కి కృతజ్ఞతలు చెప్పారు. కాగా గత అక్టోబర్‌లో కరూర్‌లో విజయ్ నిర్వహించిన తొలి ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు ప్రభుత్వం సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంవల్లే ఆ ఘటన జరిగిందని టీవీకే ఆరోపిస్తూ వస్తున్నది.