నా చెల్లెలు మమత ఆ పని చేస్తారనుకుంటున్నాను..: బెంగాల్ గవర్నర్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బుధవారం మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయగానే ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ఆమెకు ఓ బలమైన సందేశం పంపించారు. మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఆమెను అభినందిస్తూనే.. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింస గురించి ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా జగ్దీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అర్జెంటుగా సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. నా చెల్లెలు మమతా బెనర్జీ ఆ పని చేస్తారన్న నమ్మకం నాకు ఉంది అని జగ్దీప్ ధన్కర్ అనడం గమనార్హం.
మీరు పక్షపాత ప్రయోజనాలను పక్కనపెడతారని, పాలనలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తారని భావిస్తున్నట్లు గవర్నర్ జగ్దీప్ అన్నారు. బెంగాల్లో ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. 292 స్థానాలకు కౌంటింగ్ జరగగా.. 213 స్థానాల్లో గెలిచి తృణమూల్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ వెంటనే బెంగాల్లో హింస చెలరేగింది. ప్రతిపక్ష బీజేపీ లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇందులో 12 మంది మృత్యువాత పడ్డారు.
I congratulate Mamata Ji on her third term. Our priority is that we must bring an end to this senseless violence that has affected society at large. I have every hope that the CM on an urgent basis will take all steps to restore rule of law: West Bengal Governor pic.twitter.com/bn3jbtQaGM
— ANI (@ANI) May 5, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

