Nitish Kumar | తలుపులు తెరిచే ఉన్నాయన్న లాలూ వ్యాఖ్యలపై నితీశ్ ఎలా స్పందించారంటే?
Nitish Kumar | లాలూ వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ శనివారం స్పందించారు. ఎవరు ఏమి చెప్పినా తాను పట్టించుకోనని అన్నారు. ‘పరిస్థితులు సరిగ్గా లేవు. అందుకే నేను వారిని (ఆర్జేడీ) వీడాను’ అని చెప్పారు.
పాట్నా: బీహార్ సీఎం, జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్కు (Nitish Kumar ) తలుపులు తెరిచే ఉన్నాయని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం మీడియాతో అన్నారు. మహాకూటమిలోకి ఆయన తిరిగి వస్తే చూద్దామని చెప్పారు. అయితే లాలూ చేసిన ఈ వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ శనివారం స్పందించారు. ఎవరు ఏమి చెప్పినా తాను పట్టించుకోనని అన్నారు. ‘పరిస్థితులు సరిగ్గా లేవు. అందుకే నేను వారిని (ఆర్జేడీ) వీడాను’ అని చెప్పారు. తమ మధ్య ఏం తప్పు జరిగిందో అన్నదానిపై ఇప్పుడు దర్యాప్తు చేస్తామని మీడియాకు తెలిపారు.
కాగా, ప్రతిపక్ష కూటమికి ‘ఇండియా’ బ్లాక్ అని పేరు పెట్టడం తనకు ఇష్టం లేదని నితీశ్ కుమార్ తెలిపారు. ‘నేను నా వంతు ప్రయత్నం చేశా. కూటమికి ఈ పేరు పెట్టడానికి నేను ఇష్టపడలేదు. నా మనస్సులో వేరే విషయం ఉంది’ అని అన్నారు. అయితే ఆ కూటమితో పొత్తు ముగిసిందని చెప్పారు. బీహార్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నానని వెల్లడించారు.
జనవరిలో ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం నుంచి తప్పుకున్న నితీశ్ కుమార్ మళ్లీ బీజేపీతో జతకట్టారు. ఎన్డీయే మద్దతుతో మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇకపై శాశ్వతంగా ఎన్డీయేతో కలిసి ఉంటానని స్పష్టం చేశారు.
#WATCH | On Lalu Yadav's 'doors open' remark, Bihar CM & JD(U) leader Nitish Kumar says, "Don't think of who says what…Things were not going well, so I left them (RJD)…" pic.twitter.com/CEBDq5LaMn
— ANI (@ANI) February 17, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

