రాష్ట్రపతి ముర్మును నేను క్షమాపణ కోరుతున్నా: మమతాబెనర్జి
Mamata Banerjee | రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తాను క్షమాపణ కోరుతున్నానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి వ్యాఖ్యానించారు. ఇవాళ
కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తాను క్షమాపణ కోరుతున్నానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి వ్యాఖ్యానించారు. ఇవాళ నబన్నాలో మీడియా సమావేశంలో మాట్లాడిన మమత.. ‘రాష్ట్రపతి చాలా మంచి మహిళ. అఖిల్‌గిరి చేసింది తప్పు. నేను క్షమాపణ కోరుతున్నా. మా ఎమ్మెల్యే తరఫున నేను క్షమాపణ కోరుతున్నా. ఐయామ్ సారీ’ అని ఆమె చెప్పారు.
ఈస్ట్ మిడ్నాపూర్‌లోని రామ్‌నగర్‌కు చెందిన ఎమ్మెల్యే, బెంగాల్ జైళ్ల శాఖ మంత్రి అఖిల్‌గిరి గత శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్‌లో బెంగాల్ బీజేఎల్పీ నేత సువేందు అధికారిపై విమర్శలు చేస్తూ అఖిల్‌గిరి నోరుజారారు. సువేందు అధికారిని ఉద్దేశించి మేం మనుషుల రూపు చూసి జడ్జి చేయం. రాష్ట్రపతి కుర్చీని గౌరవిస్తాం. కానీ, మీ రాష్ట్రపతి చూడ్డానికి ఎలా ఉంది..? అని వ్యాఖ్యానించారు.
కాగా, అఖిల్‌గిరి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఆయన రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పారు. తాజాగా నబన్నాలో ప్రెస్ మీట్ పెట్టి మరీ మమతాబెనర్జి కూడా రాష్ట్రపతికి క్షమాపణలు తెలియజేశారు. మా పార్టీలో ఎవరైనా పొరపాటు చేస్తే తాము వ్యతిరేకిస్తామని అన్నారు. అలాంటి వాటిని తాము సహించమని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

