జీవన నాణ్యతలో హైదరాబాద్ బెస్ట్
అంతర్జాతీయ సూచికలో హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. గత 10 ఏండ్లుగా స్థిరమైన పాలన, ప్రశాంత రాజకీయ వాతావరణం ఫలితంగా హైదరాబాద్ నగరంలో జీవన నాణ్యత మెరుగుపడిందని ‘మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ ఇండెక్స్' తాజా నివేదిక (2023) కుండబద్దలు కొట్టింది.
- బెంగళూరు, పుణేను వెనక్కి నెట్టిన భాగ్యనగరం
- దేశంలోనే అగ్రస్థానం.. ప్రపంచంలో 153వ ర్యాంక్
- మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2023 వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: అంతర్జాతీయ సూచికలో హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. గత 10 ఏండ్లుగా స్థిరమైన పాలన, ప్రశాంత రాజకీయ వాతావరణం ఫలితంగా హైదరాబాద్ నగరంలో జీవన నాణ్యత మెరుగుపడిందని ‘మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ ఇండెక్స్’ తాజా నివేదిక (2023) కుండబద్దలు కొట్టింది. మెర్సర్స్ వరల్డ్‌వైడ్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ (జీవన నాణ్యత) తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి హైదరాబాద్‌కు అత్యుత్తమ ర్యాంక్ దక్కింది.
బెంగళూరు, పుణే వంటి నగరాలను భాగ్యనగరం వెనక్కి నెట్టింది. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ 153వ స్థానంలో నిలువగా, పుణెకు 154, బెంగళూరుకు 156 ర్యాంకులు దక్కాయి. చెన్నై(161), ముంబై (164), కోల్‌కతా (170), న్యూఢిల్లీ (172) నగరాలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో విదేశీ ఉద్యోగులు, ప్రవాసులు, వారి కుటుంబాల రోజువారీ జీవనం.. వాస్తవ పరిస్థితుల ఆధారంగా ‘మెర్సర్స్’ ఈ ర్యాంకుల్ని విడుదల చేసింది.
ఈ ర్యాంకింగ్స్‌లో భారత దేశానికి చెందిన 7 నగరాలు మాత్రమే చోటు దక్కించుకోగా, అందులో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవటం విశేషం. వివిధ దేశాలకు చెందిన ఉద్యోగులు, వారి కుటుంబాలకు అత్యంత నాణ్యతతో కూడిన జీవన పరిస్థితులు హైదరాబాద్ నగరంలో ఉన్నాయన్న సంగతి ‘మెర్సర్స్ ఇండెక్స్’ గణాంకాలతో సహా చూపుతున్నది. ఆర్థిక పరిస్థితులు, రాజకీయ హింస లేకపోవటం, సామాజిక సమానత్వం.. వంటివి ర్యాంకింగ్స్‌లో పరిగణనలోకి తీసుకోగా, భారత్‌లో మిగతా అన్ని నగరాలకన్నా హైదరాబాద్ మెరుగైన స్థానంలో నిలిచింది.
మొదటి స్థానంలో వియన్నా
తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రియా రాజధాని వియన్నా ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. జాబితాలో జ్యూరిచ్ (స్విట్జర్లాండ్), అక్లాండ్ (న్యూజిలాండ్) నగరాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అత్యంత దారుణమైన జీవన పరిస్థితులు నెలకొన్న ఆఫ్రికా నగరాలైన ఎన్జామినా(చాద్)- 236, బాంగు(సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్)- 239, ఖర్తోమ్ (సూడాన్)-241 సూచికలో అట్టడుగున నిలిచాయి. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నగరాలైన సింగపూర్-29, న్యూయార్క్-40, లండన్-45, దుబాయ్-79, టోక్యో-50, అబుదాబీ-84, షాంఘై-109, బీజింగ్-126వ ర్యాంకులు దక్కించుకున్నాయి.
నగరం : ర్యాంకు
హైదరాబాద్ : 153
పుణె : 154
బెంగళూరు : 156
చెన్నై : 161
ముంబై : 164
కోల్‌కతా : 170
న్యూఢిల్లీ : 172
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

