న్యూఢిల్లీ, జనవరి 2: ప్రపంచ ర్యాంకింగ్‌లో హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టులు టాప్ లేపాయి. నిర్వహణా సామర్థ్యం, సమయపాలన అంశాలలో ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాలలో హైదరాబాద్, బెంగళూరు వరుసగా రెండు, మూడు ర్యాంకులు దక్కించుకున్నాయి.
అమెరికాకు చెందిన మినియాపోలిస్-సెయింట్ విమానాశ్రయం మొదటి ర్యాంక్‌లో నిలిచింది. ఏవియేషన్ ఎనలిటిక్ సంస్థ సిరియమ్ 2023 ఏడాదికి రూపొందించిన ఆన్‌టైమ్ పెరఫార్మెన్స్ రివ్యూ (ఓటీపీ)లో భారత్ నుంచి హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా విమానాశ్రయాలకు స్థానం లభించింది. వైమానిక సంస్థలలో ఇండిగోకు స్థానం దక్కింది.