Watch: పోలీసులతో వందలాది నిరసనకారులు ఘర్షణ.. అడ్డుగా ఉన్న బారికేడ్లు తొలగింపు
పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. కత్తులు, తుపాకులతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వారిస్ పంజాబ్ దే గ్రూప్‌నకు చెందిన నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అమృత్సర్: వందలాది మంది నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. అడ్డుగా ఉంచిన బారికేడ్లు తొలగించి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఒక వ్యక్తి అరెస్ట్‌కు వ్యతిరేకంగా భారీగా బల ప్రదర్శన నిర్వహించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఈ సంఘటన జరిగింది. వారిస్ పంజాబ్ దే గ్రూప్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ ముఖ్య అనుచరుడు లవ్‌ప్రీత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా ఆ గ్రూప్‌కు చెందిన వందలాది మంది మద్దతుదారులు గురువారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అజ్నాలా పోలీస్ స్టేషన్ బయట ఉన్న ఫెన్సింగ్‌ను దాటి వెళ్లారు. అడ్డుగా ఉంచిన బారికేడ్లను బలవంతంగా తొలగించారు. వారిస్ పంజాబ్ దే గ్రూప్‌కు చెందిన ఒక వాహనంతో పాటు వందలాది మంది ఆ సంస్థ సభ్యులు ఆ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కత్తులు, తుపాకులు చేతపట్టిన వారంతా అక్కడున్న పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు.
కాగా, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన అనుచరుడు లవ్‌ప్రీత్ సింగ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని వారిస్ పంజాబ్ దే గ్రూప్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ ఆరోపించాడు. ఒక్క గంటలో కేసును వెనక్కి తీసుకోకపోతే జరిగే పరిణామాలకు అధికారులదే బాధ్యత అని హెచ్చరించాడు. తామేమీ చేయలేమని అధికారులు, పోలీసులు భావిస్తున్నారని, అందుకే ఈ బలప్రదర్శన చేపట్టినట్లు చెప్పాడు.
మరోవైపు అజ్నాలా పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. కత్తులు, తుపాకులతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వారిస్ పంజాబ్ దే గ్రూప్‌నకు చెందిన నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#WATCH | Punjab: Supporters of 'Waris Punjab De' Chief Amritpal Singh break through police barricades with swords and guns outside Ajnala PS in Amritsar
They've gathered outside the PS in order to protest against the arrest of his (Amritpal Singh) close aide Lovepreet Toofan. pic.twitter.com/yhE8XkwYOO
— ANI (@ANI) February 23, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

