Congress | లక్ష రూపాయలు ఎప్పుడిస్తారు?.. లక్నో కాంగ్రెస్ కార్యాలయం వద్ద మహిళల భారీ లైన్లు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని మించి ఇండియా కూటమి ఉత్తరప్రదేశ్లో అత్యధిక సీట్లు గెలుపొందడంతో ఆ రాష్ట్ర మహిళలు ఎన్నికల వాగ్దానం అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ కార్యాలయం వద్ద బారులు తీరారు.
- ఎన్నికల్లో చేసిన వాగ్దానం అమలు చేయాలని డిమాండ్
- ఎన్నికలకు ముందే కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుల పంపిణీ
- కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు నెలకు రూ.8,500 ఇస్తామని కాంగ్రెస్ వాగ్దానం
- బెంగళూరు జీపీఓలో భారీగా ఖాతాలు ప్రారంభం
Congress | న్యూఢిల్లీ, జూన్ 6: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని మించి ఇండియా కూటమి ఉత్తరప్రదేశ్లో అత్యధిక సీట్లు గెలుపొందడంతో ఆ రాష్ట్ర మహిళలు ఎన్నికల వాగ్దానం అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ కార్యాలయం వద్ద బారులు తీరారు. ప్రచారం సమయంలో వాగ్దానం చేసినట్టుగా గ్యారెంటీ కార్డులను ఇవ్వాలని వారు కాంగ్రెస్ నేతలను డిమాండ్ చేశారు. ప్రచారం సమయంలో కాంగ్రెస్ నేతలు పలువురు గృహిణులకు గ్యారెంటీ కార్డులను పంపిణీ చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. మహిళలు కుటుంబ పెద్దలుగా ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఏటా రూ.లక్ష అందజేస్తామని వాగ్దానం చేశారు.
యూపీలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధిక సీట్లను గెలుచుకుంది. రాష్ట్రంలోని మొత్తం 80 స్థానాలకు గాను ఎన్డీయే 37 సీట్లు గెలుపొందగా, ఇండియా కూటమి 43 స్థానాలను గెలుచుకుంది. దీంతో పలువురు ముస్లిం మహిళలు గురువారం లక్నోలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద బారులుతీరి తమకు గ్యారెంటీ కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంతకుముందే గ్యారెంటీ కార్డులు అందకున్న మహిళలు తమ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు వేయాలని కోరుతూ దరఖాస్తు పత్రాలు అందజేశారు. తాము అందించిన పత్రాలకు కాంగ్రెస్ కార్యాలయం రశీదులు కూడా ఇచ్చిందని పలువురు మహిళలు తెలిపారు.
ఘర్ఘర్ గ్యారెంటీ!
ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ‘ఘర్ ఘర్ గ్యారెంటీ (ఇంటింటికీ గ్యారెంటీ) పథకాన్ని ప్రారంభించింది. పార్టీ వాగ్దానం చేసిన 25 గ్యారెంటీలను కనీసం ఎనిమిది కోట్ల కుటుంబాల వద్దకు చేర్చాలని నాయకులకు టార్గెట్ విధించింది. ఈ గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. దారిద్య్ర రేఖకు దిగవున ఉన్న, మహిళలు కుటుంబ పెద్దగా ఉన్న కుటుంబాలకు నెలకు రూ.8,500 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని వాగ్దానం చేసింది. గత ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైతం కాంగ్రెస్ పార్టీ ఇదేవిధమైన వాగ్దానం చేసింది. కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు నెలకు రూ.2000 చొప్పున అందజేస్తామని పేర్కొంది. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది, తమ ఖాతాల్లో నెలకు రూ.8,500 బదిలీ అవుతాయి అన్న ఆశతో ఇటీవల పలువురు మహిళలు బెంగళూరులోని జనరల్ పోస్ట్ ఆఫీసులో భారీ సంఖ్యలో ఖాతాలు ప్రారంభించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

