మనం మాస్కులు ఇంకా ఎన్ని రోజులు పెట్టుకోవాలి.. ప్రభుత్వం మాట ఇదీ!

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఇప్పటికే రెండుసార్లు దేశాన్ని వణికించింది. ఇక ఇప్పుడు మూడో వేవ్ ఎప్పుడొస్తుందా తెలియక జనం బిక్కుబిక్కుమంటున్నారు. అయితే కేసులు పెరగ్గానే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం.. కాస్త తగ్గగానే కనీసం మాస్కులు కూడా లేకుండా తిరగడం చాలా మందికి అలవాటుగా మారింది. అయితే మరికొంత మందిలో ఈ మాస్కులు ఇంకా ఎన్ని రోజులు పెట్టుకోవాలన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఓవైపు విదేశాల్లో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు మాస్కులు అవసరం లేదని అక్కడి ప్రభుత్వాలు చెప్పేశాయి. మన దగ్గర మాత్రం రెండు డోసులు తీసుకున్నా.. మాస్కులు పెట్టుకోవడం కొనసాగించండని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ మాస్కులు ఇంకెన్నాళ్లన్న ప్రశ్నపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పందించారు.
2022 వరకూ మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే అని వీకే పాల్ స్పష్టం చేశారు. దేశంలో పండుగల సీజన్ ప్రారంభం కావడంతో థర్డ్‌వేవ్ ముప్పు ముంగిట్లో ఉన్నామని ఆయన అన్నారు. వ్యాక్సిన్లు, అత్యవసర మందులు, కఠిన ఆంక్షలతోనే కొవిడ్‌కు చెక్ పెట్టగలమని అన్నారు. ఇప్పుడే ప్రజలు రిలాక్స్ కావద్దని, అది ముప్పును మరింత పెంచుతుందని హెచ్చరించారు. ఇప్పటికే పండుగల సందర్భంగా భారీగా ప్రజలు గుమిగూడకుండా చూడాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కొవిడ్ కేసులు పెరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే కఠిన ఆంక్షలతో మొదట్లోనే కట్టడి చేయాలని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

