Shambhu Border | శంభు హైవేను ఎలా మూసేస్తారు.. తెరువాలంటూ హర్యానాకు సుప్రీంకోర్టు ఆదేశం
Shambhu Border | దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని శంభు హైవేను మూసివేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. హైవేను ఎలా బ్లాక్ చేస్తారని ప్రశ్నించింది. శంభు సరిహద్దు హైవేను తెరువాలని, ట్రాఫిక్‌ను అనుమతించాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని శంభు హైవేను మూసివేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. హైవేను ఎలా బ్లాక్ చేస్తారని ప్రశ్నించింది. శంభు సరిహద్దు (Shambhu Border) హైవేను తెరువాలని, ట్రాఫిక్‌ను అనుమతించాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. కనీస మద్దతు ధరతోపాటు తమ డిమాండ్ల కోసం ఫిబ్రవరి 13న ఛలో ఢిల్లీకి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో రైతులను నిలువరించేందుకు శంభు సరిహద్దును హర్యానా ప్రభుత్వం మూసివేసింది. ఘర్షణల నేపథ్యంలో హైవేకు అడ్డుగా సిమెంట్ బారికేడ్లు, ఇనుప తీగలు ఏర్పాటు చేసింది. భారీగా పోలీసులను మోహరించింది. దీంతో రైతులు నాటి నుంచి అక్కడే మకాం వేశారు.
కాగా, శంభు సరిహద్దును తెరువాలని, ఏడు రోజుల్లో ట్రాఫిక్‌ను పునరుద్ధరించాలని హర్యానా ప్రభుత్వాన్ని పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశించింది. జూలై 10న ఈ మేరకు తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను రైతులు స్వాగతించారు. దేశ రాజధానికి తమ పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు.
మరోవైపు హైకోర్టు ఆర్డర్‌ను సుప్రీంకోర్టులో హర్యానా ప్రభుత్వం అప్పీల్ చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం దీనిపై విచారణ జరిపింది. ‘ఒక రాష్ట్రం హైవేను ఎలా అడ్డుకుంటుంది? ట్రాఫిక్‌ను నియంత్రించాల్సిన బాధ్యత ఉంది. దానిని తెరువాలని మేం చెబుతున్నాం. కానీ వాహనాల కదలికలను నియంత్రించండి’ అని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. హర్యానా ప్రభుత్వం తరపు న్యాయవాదికి ఈ మేరకు సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

