Hong Kong | ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాలపై హాంకాంగ్ నిషేధం..
భారత్‌కి చెందిన ప్రముఖ కంపెనీల మసాలా ఉత్పత్తులపై విదేశాల్లో వరుసగా ఆంక్షలు విధిస్తున్నారు. ఇటీవలే ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాపై సింగపూర్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఎవరెస్ట్తోపాటు మరో కంపెనీపై హాంకాంగ్ (Hong Kong) వేటు వేసింది.
న్యూఢిల్లీ: భారత్‌కి చెందిన ప్రముఖ కంపెనీల మసాలా ఉత్పత్తులపై విదేశాల్లో వరుసగా ఆంక్షలు విధిస్తున్నారు. ఇటీవలే ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాపై సింగపూర్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఎవరెస్ట్తోపాటు మరో కంపెనీపై హాంకాంగ్ (Hong Kong) వేటు వేసింది. ఎండీహెచ్ (MDH) సంస్థ తయారు చేస్తున్న సాంబార్ మసాలా, ఎవరెస్ట్ (Everest) ఆహార ఉత్పత్తులపై కూడా వేటువేసింది. ఈ మసాలాలో ఇథిలీన్ ఆక్సైడ్ మోతాదుకుమించి ఉంటున్నదని, అందుకే నిషేధిస్తున్నామని స్పష్టం చేసింది. ఇది పురుగుల మందు అని, దానివల్ల ప్రాణానికి ముప్పు అని స్పష్టం చేసింది.
ఈ నెల 5వ తేదీనే వాటిని బ్యాన్ చేసినట్లు హాంగ్‌కాంగ్ ఆహార భద్రతా విభాగమైన సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ (సీఎఫ్ఎస్) తెలిపింది. సాధారణ తనిఖీల్లో భాగంగా అన్ని ఆహార పదార్థాలను పరిశీలించగా ఎండీహెచ్ గ్రూప్‌నకు చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్‌లో పెస్టిసైడ్, ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్టు గుర్తించామని అధికారులు తెలిపారు. మొత్తం మూడు రిటైల్ ఔట్లెట్స్ నుంచి ఈ ప్యాక్‌లను సేకరించి పరిశీలించామని వెల్లడించారు. దీంతో ఆ ఉత్పత్తుల విక్రయాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలోనూ ఇదే రసాయనం ఉందని వెల్లడించారు. ఇది క్యాన్సర్ కారకాల జాబితాలో ఉందని పేర్కొన్నారు.
ఎవరెస్ట్‌పై సింగపూర్‌లో..
భారత్ నుంచి దిగుమతి చేసుకున్న ‘ఎవరెస్ట్ చేపల కూర మసాలా’లో పరిమితికి మించి పురుగుమందు అవశేషాలు ఉన్నట్టు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ (ఎస్ఎఫ్ఏ) ఆరోపించింది. దీంతో ఫిష్ మసాలా ప్యాకెట్లను రీకాల్ చేయాలని ఎస్ఎఫ్ఏ ఆదేశించింది. హాంకాంగ్‌లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ జారీ చేసిన నోటిఫికేషన్‌కు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్టు సింగపూర్ తెలిపింది. ఉత్పత్తులను వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించాలని ఎస్పీ ముత్తయ్య అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సూచించింది. అయితే ఈ ఆరోపణపై ఎవరెస్ట్ కంపెనీ ఇంకా స్పందించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

