Manipur | 20 ఏళ్ల తర్వాత.. మణిపూర్లో హిందీ చిత్రం బహిరంగ ప్రదర్శన
Manipur | మూడు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur )లో కాస్త శాంతి నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాల్లో (Independence Day) ఈశాన్య రాష్ట్రం ఓ ప్రత్యేకతను చాటుకోబోతోంది. ఉగ్రవాదుల నుంచి విముక్తి కోరుకుంటూ విద్యార్థి సంఘాలు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓ హిందీ చిత్రాన్ని (Hindi Film) బహిరంగంగా ప్రదర్శించాలని నిర్ణయించాయి.
Manipur | మూడు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur )లో కాస్త శాంతి నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాల్లో (Independence Day) ఈశాన్య రాష్ట్రం ఓ ప్రత్యేకతను చాటుకోబోతోంది. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రెండు దశాబ్దాల క్రితం విధించబడ్డ ఆంక్షలకు చెక్ పెడుతూ విద్యార్థి సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఉగ్రవాదుల నుంచి విముక్తి కోరుకుంటూ ఓ హిందీ చిత్రాన్ని (Hindi Film) బహిరంగంగా ప్రదర్శించాలని నిర్ణయించాయి.
ఈ మేరకు గిరిజన సంఘం హ్మర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (Tribal organisation Hmar Students Association) సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. చురాచాంద్పూర్ (Churachandpur) జిల్లాలోని రెంగ్కాయ్ (Rengkai )లో మంగళవారం సాయంత్రం ఓ హిందీ సినిమాను బహిరంగంగా ప్రదర్శించనున్నట్లు (Publicly Screen) పేర్కొంది. గిరిజనులను ఉగ్రవాద సంస్థలు దశాబ్దాల నుంచి అణచివేస్తున్నాయని, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తమ ధిక్కార ధోరణిని వ్యక్తం చేయడానికే తాము హిందీ సినిమాను ప్రదర్శించాలని నిర్ణయించినట్లు విద్యార్థి సంఘం తన ప్రకనటలో తెలిపింది. తాజా నిర్ణయంతో స్వాతంత్య్ర దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన దేశ వ్యతిరేక ఉగ్రవాద గ్రూపుల నుంచి స్వేచ్ఛను ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. స్వాతంత్ర్యం, న్యాయం కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని తాము చేస్తున్న శపథంలో అందరూ పాలుపంచుకోవాలని కోరింది. అయితే ఏ సినిమాను ప్రదర్శిస్తారో మాత్రం వారు వెల్లడించలేదు.
కాగా, మణిపూర్లో బహిరంగంగా ప్రదర్శించబడిన చివరి హిందీ చిత్రం ‘కుచ్ కుచ్ హోతా హై’ (Kuch Kuch Hota Hai). 1998లో ఈ చిత్రాన్ని అక్కడ ప్రదర్శించారు. ఆ తర్వాత రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ (Revolutionary Peoples Front) అనే తిరుగుబాటు సంస్థ సెప్టెంబర్ 12, 2000 సంవత్సరంలో హిందీ చిత్రాల ప్రదర్శనపై నిషేధం విధించింది. ప్రకటన చేసిన వారం రోజుల్లోనే రాష్ట్రంలోని అవుట్లెట్ల నుంచి సేకరించిన దాదాపు 6,000 నుంచి 8,000 వరకు ఆడియో, వీడియో క్యాసెట్లు, కాంపాక్ట్ డిస్క్లను తిరుగుబాటుదారులు తగులబెట్టారు. అయితే ఈశాన్య రాష్ట్రంలో హిందీ సినిమాల నిషేధానికి కారణమేమిటన్నది ఆ ఉగ్రవాద సంస్థ (RPF) చెప్పలేదు. కానీ, రాష్ట్ర భాష, సంస్కృతిపై బాలీవుడ్ ప్రతికూల ప్రభావం చూపుతుందన్న భయంతోనే తీవ్రవాద సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆపరేటర్లు తెలిపారు. స్టూడెంట్స్ అసోసియేషన్ తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మణిపూర్లో ఓ హిందీ చిత్రం బహిరంగంగా ప్రదర్శితం కానుండటం విశేషం.
Also Read..
Burj Khalifa | బుర్జ్ ఖలీఫాపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

